“వినయ విధేయ రామ” ఫస్ట్ లుక్ లో కౌశల్..?

Wednesday, November 7th, 2018, 10:03:33 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా ఊర మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం “వినయ విధేయ రామ”. అయితే ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను నిన్న విడుదల చేశారు.ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అభిమానులకు ఈ పోస్టర్ మాత్రం తెగ నచ్చేసింది. ఈ చిత్రంలో బుల్లితెర సెన్సేషన్ “కౌశల్” కూడా నటిస్తున్నాడని ఆ మధ్య వార్తలొచ్చిన సంగతి తెలిసినదే..అయితే నిన్న విడుదల చేసినటువంటి రామ్ చరణ్ యొక్క పోస్టర్ లో బాగా గమనించినట్లయితే ఆ వెనుక కూడా ఎవరో మనిషి ఉన్నట్టు కనిపిస్తుంది.ఆ వ్యక్తిని కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే అది కౌశల్ లాగే కనిపిస్తున్నాడని ఇప్పుడు సోషల్ మీడియాలో “కౌశల్ ఆర్మీ” పోస్ట్ లు పెడుతూ హల్ చల్ చేస్తున్నారు.మరి ఈ వార్త ఎంత వరకు నిజమో ఆ చిత్రం విడుడల తర్వాత ఆ పోరాట సన్నివేశం వరకు వేచి చూడాల్సిందే.