కొరటాల శివ మరొక బ్లాక్ బస్టర్ కి సిద్దం అయ్యారా!?

Saturday, August 1st, 2020, 12:34:43 AM IST


ఒక సినిమా విడుదల కాకముందే బ్లాక్ బస్టర్ అవుతుంది అని కొన్నిటి మీదనే నమ్మకం ఉంటుంది. అలా నమ్మకం కలిగించిన దర్శకులలో కొరటాల శివ ఒకరు. మొదటి సినిమా నుండి సామాజిక స్పృహ, సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించడం లో కొరటాల శివ తర్వాతే ఎవరైనా. ఇప్పటికే చిరు ఆచార్య చిత్రం తో బుకి గా ఉన్న కొరటాల, అల్లు అర్జున్ తో ఎట్టకేలకు సినిమా అనౌన్స్ చేసేశారు.

అయితే అల్లు అర్జున్ తో తీస్తున్న సినిమా కోసం కొత్త నిర్మాతలను పరిచయం చేస్తున్నారు కొరటాల. యువసుధ ఆర్ట్స్ ను ఎంకరేజ్ చేస్తూ ప్రొడక్షన్ వన్ పేరిట అనౌన్స్ మెంట్ పోస్టర్ విడుదల అయింది. అయితే ఈ చిత్రం పై అభిమానులు, ప్రేక్షకులు భారీగా స్పందిస్తున్నారు. మోస్ట్ అవైటడ్ మూవీ అంటూ కొందరు చెబుతున్నారు. ఈ చిత్రం కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అని అంటున్నారు. అల్లు అర్జున్ సైతం అలా వైకుంఠ పురం లో చిత్రం బ్లాక్ బస్టర్ విజయం తో మాంచి ఊపు మీద ఉండగా, పుష్ప చిత్రం చేస్తున్నారు. ఇపుడు కొత్తగా చేసిన అనౌన్స్మెంట్ అభిమానులక పండగ వాతావరణాన్ని తలపిస్తుంది.