బన్నీ కోసం కథ సిద్దం చేసిన కొరటాల!?

Friday, July 24th, 2020, 01:12:58 AM IST


అలా వైకుంఠపురం లో చిత్రం తో ఇండస్ట్రీ హిట్ కొట్టారు అల్లు అర్జున్. ఈ చిత్రం మళ్లీ అల్లు అర్జున్ కెరీర్ కి బూస్ట్ ఇచ్చింది అని చెప్పాలి. కేవలం తెలుగు నాట మాత్రమే కాక, సౌత్ ఇండియా లో సూపర్ క్రేజ్ తో దూసుకు పోతున్నారు అల్లు అర్జున్. అయితే అల్లు అర్జున్ కి వస్తున్న క్రేజ్ ను క్యాష్ చేసుకునే పని లో ఉన్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే సుకుమార్ దర్శకత్వం లో పుష్ప చిత్రం లో నటిస్తున్నారు అల్లు అర్జున్. ఈ చిత్రం ఒక్క తెలుగు లో మాత్రమే కాకుండా, మిగతా భాషల్లో సైతం విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది చిత్త యూనిట్. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా చిత్రం గా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుకుమార్.

అయితే ఈ చిత్రం అనంతరం అల్లు అర్జున్ దర్శకుడు కొరటాల శివ తో చిత్రం చేయనున్నట్లు ఫిల్మ్ నగర్ లో ఒక వార్త చెక్కర్లు కొడుతుంది. అల్లు అర్జున్ స్టైల్, క్రేజ్ దృష్ట్యా ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్ సిద్దం చేశారట కొరటాల శివ. అయితే ప్రస్తుతం ఆచార్య చిత్రం తో బిజీ గా గడుపుతున్న కొరటాల, ఈ చిత్రం అనంతరం అల్లు అర్జున్ తో చేసే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. అయితే ఇది నిజమో కాదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.