ఆ హీరోయిన్ తో మహేష్ మళ్ళీ సినిమా చేస్తాడా?

Thursday, January 23rd, 2020, 01:03:14 PM IST

వరుస విజయాలతో మహేష్ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఒకరి తర్వాత మరొకరితో సినిమాలు చేస్తూ బిజీగా గడిపేస్తున్నారు మహేష్. అయితే భరత్ అనే నేను చిత్రం లో కియారా అద్వానీ వసుమతి పాత్రలో మహేష్ సరసన చాల అద్భుతంగా నటించింది అని పేరు తెచ్చుకుంది. అయితే సరిలేరు నీకెవ్వరూ చిత్రం తర్వాత మహేష్ వంశీ పైడిపల్లి తో చిత్రం చేయనున్నాడని సమాచారం. మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన వంశీ పైడిపల్లి తో మహేష్ రెండోసారి చేయడం పట్ల ఈ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం వుంది. దానికి తగ్గట్లుగానే బ్లాక్ బస్టర్ హీరోయిన్ వేటలో పడ్డారు దర్శకనిర్మాతలు.

ఈ చిత్రానికి మహేష్ భార్య నమ్రత కియారా అద్వానీ పేరుని సూచించినట్లు సమాచారం. వరుస విజయాలతో దూసుకుపోతున్న మహేష్ ఈ ఏడాది ఆరంభం లోనే సరిలేరు నీకెవ్వరూ చిత్రం తో 200 కోట్ల రూపాయల కలెక్షన్లు వసూళ్లు చేసి మరొకసారి బాక్సఫీస్ సూపర్ స్టార్ అనిపించుకున్నారు. ప్రస్తుతం న్యూయార్క్ టూర్ లో వున్న మహేష్ ఇక్కడికి వచ్చాక ఈ చిత్రానికి సంబంధించి కొన్ని విషయాల ఫై క్లారిటీ రానుంది.