షాకింగ్ : టాక్సీవాలా ప్రీ రిలీజ్ కు బాహుబలి..?

Thursday, November 8th, 2018, 08:10:44 PM IST

టాలీవుడ్ లో అతి కొద్ది చిత్రాలతోనే సంచలన నటునిగా మారిపోయిన అతి కొద్ది నటుల్లో రౌడీ యాక్టర్ విజయ్ దేవర కొండ కూడా ఒకరు.అయితే విజయ్ కు మాత్రం గత కొంత కాలంగా కలం అసలు కలిసి రావట్లేదు.అర్జున్ రెడ్డితో మొదలయిన వివాదాలు ఇప్పుడు తాజాగా విడుదల కాబోతున్న “టాక్సీవాలా” వరకు ఏదొక సమస్య ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి.వివాదాలు,లీక్ టెన్షన్లు ఈ మధ్య విజయ్ ను బాగా విసిగించేశాయి.దానికి తోడు భారీ అంచనాల నడుమ వచ్చినటువంటి ”నోటా” చిత్రం కూడా బొక్క బోర్లా పడింది..అయితే ఆ ఎఫెక్ట్ ఇప్పుడు విడుదల కాబోయే చిత్రానికి పడకూడదని ఈ చిత్ర నిర్మాతలు భావిస్తున్నట్టు సమాచారం.

అయితే ఈ చిత్రం మీద అంచనాలను మరింత పెంచేందుకు ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి యంగ్ రెబెల్ స్టార్ ”ప్రభాస్” ను ఆహ్వానిస్తున్నట్టు ఇప్పుడు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఇది ఎంత వరకు నిజమో తెలియాలి అంటే ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక వరకు ఆగాల్సిందే.ప్రభాస్ కూడా ఇప్పటికే ఇలాంటి వేడుకలకు ఎన్నో సార్లు కూడా హాజరు అయ్యారు,దానికి తోడు ఈ చిత్ర నిర్మాణ సంస్థలో ప్రభాస్ సన్నిహితులు కూడా ఉండటంతో ఈ చిత్రానికి ప్రభాస్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు.