షాకింగ్ : ప్రభాస్ రాజకీయాల్లోకి వస్తున్నారా…?

Tuesday, August 20th, 2019, 09:25:42 PM IST

టాలీవుడ్ ఆజానుబాహుడు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం సాహో… కాగా ఈ చిత్రానికి సంబందించిన ప్రమోషన్లలో పాల్గొంటున్న ప్రభాస్ ఇటీవలే ఈ చిత్ర ప్రీ రిలేస్ ఈవెంట్ ను హైదరాబాద్ లో చాలా ఘనంగా నిర్వహించారు…. అయితే ఈ వేడుక తరువాత చెన్నై కి వెళ్లిన ప్రభాస్ అక్కడ జరిగిన ప్రెస్ మేట లో పాల్గొని కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అయితే అక్కడ ఒక మీడియా ప్రతినిధి ప్రభాస్ ను ఏపీ ముఖ్యమంత్రి జగన్ కోసం అడగగా, చాలా తెలివిగా రియాక్ట్ అయిన ప్రభాస్… జగన్ పాలన బాగుంది అని చెప్పాడు. అయితే ప్రభాస్ చేసిన ఈ వాఖ్యలపై వైసీపీ నేతలు సాహో కోసం చాలా మద్దతుగా మాట్లాడినప్పటికీ కూడా, టీడీపీ నేతలు మాత్రం కొందరు సాహో పై విమర్శలు చేశారు. అయితే ప్రభాస్ చేసిన ఈ వాఖ్యలు ఇపుడు ఒక కొత్త ప్రశ్నకు దారి తీసింది.

జగన్ పాలనపై అంత సానుకూలంగా స్పందించిన ప్రభాస్, ఇపుడు రాజకీయాల్లోకి రానున్నారా అనే ప్రశ్న ఇపుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే ఇదే విషయాన్నీ ప్రభాస్ పెద్దమ్మ పెద్దమ్మను అడగగా… “మా ప్రభాస్ భవిష్యత్తులో ఎప్పుడైనా రాజకీయాల్లోకి రావొచ్చునని, అవసరం అనిపించినపుడు రావడంలో తప్పేమి లేదని” ఆమె ఒక సంచలనమైన సమాధానాన్ని చెప్పారు. ఇకపోతే ప్రభాస్ పెద్దనాన్న కృష్ణం రాజు ఎలాగో ఇప్పటికే రాజకీయాల్లో ఉండటంతో, భవిష్యత్తులో ప్రభాస్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందన్న వార్తలు చాలా వరకు వస్తున్నాయి… కానీ ఈ వార్తలు ఎంత వరకు నిజమవుతాయో అని ప్రభాస్ అభిమానులందరూ కూడా ఆసక్తిని పెంచుకుంటున్నారు…