రాజమౌళి మామూలోడు కాదుగా…రామ్ చరణ్ మూడు వేషాల్లో కనిపించనున్నాడా?

Monday, March 30th, 2020, 08:44:21 PM IST

దర్శక ధీరుడు రాజమౌళి రౌద్రం రణం రుధిరం చిత్రం కోసం తీవ్ర స్థాయిలో కష్టపడుతున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు మొదటి సారి కలిసి నటిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నారు. అయితే రామ్ చరణ్ విషయంలో రాజమౌళి చాలా ప్లాన్ వేశారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ మూడు వేషాల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల అయిన భీమ్ ఫర్ రామరాజు వీడియో లో రామ్ చరణ్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించారు. అలానే రౌద్రం రణం రుధిరం మోషన్ పోస్టర్ లో చాలా డిఫెరెంట్ గా కనిపించారు. అలానే అసలైన మన్యం వీరుడు గా అల్లూరి సీతారామరాజు అసలు పాత్రలో కనిపించనున్నారు. మరి రాజమౌళి రామ్ చరణ్ అభిమానులని సర్ప్రైజ్ చేశారు. అయితే అసలు వేషంలో ఉన్న పాత్రని దాచి ఇంకా అంచనాలు పెంచే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం విడుదలకి ముందు రామ్ చరణ్ కి సంబంధించిన మరొక వీడియో కూడా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.