“డిస్కో రాజా” రిజల్ట్ పై రవితేజ డిస్టర్బ్ అయ్యారా?

Saturday, January 25th, 2020, 10:20:40 PM IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా నభా నటేష్ మరియు పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్లుగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన స్కైఫై థ్రిల్లర్ చిత్రం “డిస్కో రాజా”. చాలా కాలం తర్వాత కమర్షియల్ చిత్రాల నుంచి బ్రేక్ ఇచ్చి కొత్త జాన్రా ను టచ్ చేసి ప్రయోగం చేసారు.అయితే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఒకటేలాంటి స్పందనను రాబట్టుకోలేకపోయింది అని చెప్పాలి.రవితేజ చిత్రం అంటే అందరి హీరోల అభిమానులు హిట్టవ్వాలని కోరుకుంటారు.దీనికీ అలాగే కోరుకున్నారు.

కానీ జనరల్ ఆడియన్స్ కు ఈ చిత్రం అంతగా ఎక్కలేనట్టుంది.దీనితో కాస్త నెగిటివ్ రివ్యూస్ ను ఇచ్చారు.ఈ విషయంలో రవితేజ కాస్త డిస్టర్బ్ అయ్యారా? అన్న మాటలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.నిన్ననే జరిగిన సక్సెస్ వేడుకల్లో రవితేజ లాస్ట్ వరకు ఉండకుండా అకారణంగా వెళ్లిపోవడం కాస్త హాట్ టాపిక్ అయ్యింది.అయితే దీనికి కారణం ఈ చిత్రం రిజల్ట్ పై వచ్చిన ఆ కాస్త నెగిటివిటీయే కావచ్చు అని తెలుస్తుంది.ఓవరాల్ గా సినిమా ఫలితం ఎలా వచ్చింది అన్నది అది రాబట్టే వసూళ్ల మీదనే ఆధారపడి ఉంటుంది.మరి ఈ చిత్రం ఎంత వరకు సేఫ్ అవుతుందో చూడాలి.