హాట్ టాపిక్: రామ్ చరణ్ కోసం శంకర్ భారీ ప్లాన్..?

Thursday, April 22nd, 2021, 08:32:49 AM IST

శంకర్ దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ను ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజ్ నిర్మిస్తున్నారు. అయితే పాన్ ఇండియా చిత్రం గా తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటి వరకూ దర్శకుడు శంకర్ ఒక్క తెలుగు హీరో తో కూడా సినిమా చేయలేదు. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మొదటి సారి గా సినిమా చేస్తున్నారు. అయితే పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో ఒక కీలక పాత్ర కోసం నాలుగు భాషల్లో నలుగురు స్టార్ హీరోలు నటించనున్నారు అని తెలుస్తోంది.

హిందీ భాషలో సల్మాన్ ఖాన్, కన్నడలో ఉపేంద్ర లేఖ సుదీప్, తమిళం లో విజయ్ సేతుపతి, తెలుగు లో పవన్ కళ్యాణ్ లేదా మెగాస్టార్ చిరంజీవి ఆ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. అయితే మెగా ఫ్యామిలీ తో ఈ హీరో లకు మంచి సాన్నిహిత్యం ఉన్నందున ఈ చిత్రం లో వీరు నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గతం లో సుదీప్ మరియు విజయ్ సేతుపతి లు సై రా నరసింహ రెడ్డి చిత్రం లో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో ఉప్పెన లో నటించారు విజయ్ సేతుపతి. సల్మాన్ సైతం మెగాస్టార్ తో ఉన్న సన్నిహితం కారణంగా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీటి పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరి శంకర్, నిర్మాత దిల్ రాజు లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరొక పక్క శంకర్ భారతీయుడు 2 చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అదే విధంగా రామ్ చరణ్ ఇటు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం లో అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఆచార్య లో సిద్ధ పాత్రలో నటిస్తున్నారు.