స్వీటీ ఫ్యాన్స్ కు ఇది గుడ్ న్యూసేనా..?

Tuesday, May 19th, 2020, 12:16:04 PM IST

మన సౌత్ ఇండియాలో లేడీ సూపర్ స్టార్ హీరోయిన్ అనుష్క ఫ్యాన్స్ కాస్త విచారం లోనే ఉన్నారని చెప్పాలి. తాను లేటెస్ట్ గా నటించిన చిత్రం “నిశ్శబ్దం” ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కరోనా ఆగిపోవాల్సి వచ్చింది. ఎందరో కీలక నటులు నటించిన ఈ థ్రిల్లింగ్ చిత్రం డైరెక్ట్ గా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో వచ్చేస్తుంది అని బయటకొచ్చిన వార్త స్వీటీ అభిమానులకు జీర్ణం కాలేదు.

పైగా ఈ చిత్రమే మన తెలుగు నుంచి నేరుగా స్ట్రీమింగ్ కు వస్తున్న పెద్ద చిత్రం అని జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఎలాంటి డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లోనూ విడుదల అయ్యేది లేదు అన్నట్టు తెలుస్తుంది. ఇదే కనుక నిజం అయితే అనుష్క ఫ్యాన్స్ కు కాస్త ఊరటనిచ్చే వార్తే అని చెప్పాలి. ప్రస్తుతానికి మాత్రం చాలా వరకు ఈ సినిమా ఓటిటి లో రాదనే తెలుస్తుంది. ఇంకా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.