ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ ఏదైనా ప్లాన్ చేశారా?

Monday, May 18th, 2020, 11:19:10 PM IST

ఈ ఏడాది ఎన్టీఆర్ అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైంది. రౌద్రం రణం రుధిరం చిత్రం నుండి ఎటువంటి ఫస్ట్ లుక్ మరియు వీడియో విడుదల కావడం లేదు. ఇదే విషయం పై చిత్రం బృందం మరియు జూనియర్ ఎన్టీఆర్ లు ఇద్దరు క్లారిటీ ఇచ్చారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంది అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి టైటిల్ కూడా అయినను పోయి రావలె హస్తిన కు అంటూ వాడుక లో ఉంది. ఇంకా ఈ టైటిల్ ను కూడా కన్ఫర్మ్ చేయలేదు. అయితే ఈ చిత్రం టైటిల్ లేదా ఫస్ట్ లుక్ అయిన విడుదల అవుతుందేమో అని ఆసక్తి చూపుతున్నారు. అయితే ఎన్టీఆర్ సైతం అభిమానులను బుజ్జగిస్తూ లేఖ కూడా రాశారు. మరి ఈ సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి.