హాట్ టాపిక్: “వాల్మీకి” చిత్రం తో నాని “గ్యాంగ్ లీడర్” రిజల్ట్ మారనుందా?

Wednesday, September 18th, 2019, 11:55:32 AM IST

హరీష్ శంకర్ తనదైన మాస్ పంచులతో వాల్మీకి చిత్రాన్ని మాస్ ముద్రగా వేశారని సినిమా కి సంబందించిన ప్రోమోలు, సాంగ్స్, ఫస్ట్ లుక్, ట్రైలర్ చూస్తేనే అర్ధం అవుతుంది. మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ హరీష్ శంకర్ మరో హిట్ కొట్టడానికి సిద్ధంగా వున్నాడని తెలుస్తుంది. వరుణ్ విలనిజం ఉట్టిపడే పాత్రలో అదరగొట్టినట్లు సమాచారం. ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలతో వాల్మీకి చిత్రాన్ని మరోస్థాయికి తీసుకెళ్లనున్నాడని సమాచారం. ఈ చిత్రం లో పూజ హెగ్డే- వరుణ్ తేజ్ ల లవ్ సీన్స్ అద్భుతం గా తెరకెక్కించారని, ఇటీవల విడుదలైన వెల్లువచ్చి గోదారమ్మా ప్రోమో సాంగ్ కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసందే.

గత వరం విడుదలైన నాని గ్యాంగ్ లీడర్ చిత్రం వసూళ్ళలో కొంత నెమ్మదించినట్లు తెలుస్తుంది. ఈ చిత్రానికి ప్రీ రేలసే బిజినెస్ దాదాపు 30 కోట్ల వరకు జరిగిందనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఇంకా పూర్తీ స్థాయిలో నాని గ్యాంగ్ లీడర్ వసూళ్ళని సాధించలేదు. మరి ఈ చిత్ర కలెక్షన్స్ ని వాల్మీకి అడ్డుకుంటాడా? లేదా అనేది ప్రస్తుతం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయింది.