డైరెక్టర్ బాబీ స్క్రిప్ట్ పై సురేష్ బాబు అసంతృప్తి – “వెంకీ మామ” లేనట్లేనా?

Saturday, October 27th, 2018, 03:20:09 PM IST

వెంకటేష్ తాజాగా కమిట్ అయినా మల్టీ స్టారర్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి, ఈ చిత్రం లో వెంకీ తో పాటు నాగ చైతన్య కూడా నటిస్తున్నాడు. ఈ మధ్యనే ఈ చిత్రం పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంది, అయితే పూజా కార్యక్రమం తోనే ఈ సినిమా ఆగిపోనుంది అన్నది టాక్. బాబీ దర్శకత్వం లో సురేష్ బాబు నిర్మాణం లో రావాల్సిన చిత్రం ఆగిపోవటానికి కారణం సురేష్ బాబుకు స్క్రిప్ట్ నచ్చకపోవటమేనట. ఎన్నిసార్లు స్క్రిప్ట్ మీద చర్చ జరిపిన సురేష్ బాబు సంతృప్తి చెందలేదట. దీంతో ఈ స్క్రిప్ట్ పక్కన పెట్టేయటమే మంచిదన్న నిరణయానికి సురేష్ బాబు వచ్చినట్టు తెలుస్తుంది.

వెంకీ మామ ఇప్పటికే ఒక మల్టీ స్టారర్ లో నటిస్తున్నాడు, దిల్ రాజు నిర్మాతగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, విక్టరీ వెంకటేష్ ల కాంబినేషన్ లో అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న “ఎఫ్2 “చిత్రం ఇటీవలే షూటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. దిల్ రాజు వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో ఇది మూడో చిత్రం. ఈ కాంబినేషన్ వచ్చిన గత చిత్రాలు ఫిదా సూపర్ హిట్ కాగా, తొలిప్రేమ డీసెంట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ మధ్య మల్టీ స్టారర్ ల ట్రెండ్ పెరగటం తో బాబీ దర్శకత్వం లో వెంకీ నాగచైతన్య నటిస్తున్నారని వార్త వినగానే ఇటు దగ్గుపాటి, అటు అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న పరిస్థితి. ఈ నేపథ్యం లో ఇపుడు ఈ సినిమా అటకెక్కబోతుందంటూ వస్తున్న ఈ వార్త అభిమానులను నిరాశ పరుస్తుంది. అయితే ఈ విషయం పై అఫిషియల్ న్యూస్ వచ్చేంతవరకు వేచి చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments