ఇస్మార్ట్ అభిమానాలకి అక్టోబర్ లో అదిరిపోయే బొనంజా

Friday, September 20th, 2019, 02:24:13 PM IST

ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలుసు. ఈ సినిమా విజయం సాధించటంతో పూరి,ఇటు రామ్ ఇద్దరు కూడా ఒకేసారి ఫామ్ లోకి వచ్చినట్లు ఉంది. ముఖ్యంగా పూరి జగన్నాధ్ అయితే హిట్ అందుకొని ఎన్నో ఏళ్ళు గడుస్తుంది. ఆర్థికంగా కూడా బాగా ఇబ్బందిపడ్డారు. ఇలాంటి సమయంలో ఇస్మార్ట్ శంకర్ విజయం వలన పూరి తిరిగి ట్రాక్ లోకి ఎక్కాడు.

ఇక ఈ సినిమా మాస్ ప్రేక్షకులకి విపరీతంగా నచ్చేసింది. ఆన్లైన్ లో ఈ సినిమా కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. యూట్యూబ్ లో ఈ సినిమాకి సంబంధించి సాంగ్స్ ఏమైనా పెట్టరేమో అని రోజుకి కొన్ని వేల చూస్తున్నారు. అప్లోడ్ చేయమని వందల కామెంట్స్ వస్తున్నాయి. కానీ ఇంత వరకు యూట్యూబ్ లో కాదు, మరే ఇతర డిజిటల్ ప్లాట్ఫామ్ మీద కూడా ఈ సినిమాకి సంధించిన ఎలాంటి సాంగ్స్ కానీ, వీడియోస్ కానీ అధికారంగా విడుదల కాలేదు.

అయితే అక్టోబర్ లో ఈ సినిమాని జీ 5 యాప్ లో విడుదల చేయబోతున్నారు. ఆ తర్వాత జీ తెలుగు ఛానల్ లో కూడా రిలీజ్ చేస్తారు. ఆ రిలీజ్ కి కొద్దీ రోజుల ముందు యూట్యూబ్ లో సాంగ్స్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సినిమాకి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారు. దసరా కానుకగా ఈ సినిమా మరో సారి సందడి చేయబోతుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ కి గట్టి పోటీ ఇచ్చేందుకు జీ5 సిద్దమవుతున్న ఈ తరుణంలో తెలుగులో ఇక నుండి భారీ సినిమాల మీద జీ5 కన్నేసింది.