చెక్కు చెదరని “ఇస్మార్ట్ శంకర్” మ్యానియా.!

Sunday, September 22nd, 2019, 08:28:02 PM IST

ఈ ఏడాది విడుదలైన సినిమాలలో డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షం కురిపించిన సినిమాగా “ఇస్మార్ట్ శంకర్” చిత్రం ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. పూరి అభిమానులు అలాగే ఎనర్జిటిక్ స్టార్ రామ్ అభిమానులకు ఈ సినిమా ఒక హైదరాబాదీ దమ్ బిర్యానిలా దొరికింది.అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రానికి పూరి డైరెక్షన్ తో పాటుగా సంగీత బ్రహ్మ మణిశర్మ అందించిన సంగీతం కూడా పెద్ద ఎస్సెట్ గా నిలిచింది.మణిశర్మ అందించిన పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఒక రేంజ్ లో మాస్ ప్రేక్షకులను ఊపేసాయి.అయితే ఎంతో హిట్టయ్యిన వీడియో సాంగ్స్ కోసం మాత్రం మ్యూజిక్ లవర్స్ ఎక్కువగానే ఎదురు చూసారు.

దీనితో ఈ సినిమాలోని హిట్ సాంగ్ అయిన “దిమాక్ ఖరాబ్” ఫుల్ వీడియోను విడుదల చెయ్యగా దానికి సూపర్ రెస్పాన్స్ వస్తుంది.కేవలం ఒక్క రోజులోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ మరియు లక్షలలో లైక్స్ ను సాధించి ఇస్మార్ట్ శంకర్ మ్యానియా ఇంకా ఏ రేంజ్ లో ఉందో రుచి చూపిస్తుంది.రెండు రోజులు పూర్తయ్యే సరికి 8.1 మిలియన్ వ్యూస్ మరియు 2 లక్షల 18 వేలు లైక్స్ ను సంపాదించింది.ఈ పాట మాత్ర ఖచ్చితంగా 100 మిలియన్ మార్కును అందుకుంటుందని సంగీత ప్రియులు చెప్తున్నారు.మొత్తానికి మాత్రం ఇస్మార్ట్ శంకర్ మ్యానియా ఇప్పటికి కూడా చెక్కు చెదరలేదని చెప్పాలి.

వీడియో సాంగ్ ఇక్కడ క్లిక్ కోసం చెయ్యండి