యూట్యూబ్‌లో దిమాక్ ఖరాబ్‌తో దుమ్ములేపుతున్న ఇస్మార్ట్ శంకర్..!

Saturday, September 21st, 2019, 12:09:13 AM IST

డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ దర్శకత్వంలో హీరో రామ్ హీరోగా, నిధి అగర్వాల్, నభా నతేశ హీరోయిన్లుగా తెర‌కెక్కించిన మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ ఇస్మార్ట్ శంక‌ర్‌. ఈ సినిమా బ్లాక్ బస్టర్‌ను సొంతం చేసుకుని మంచి కలెక్షన్లను కూడా వసూల్ చేసింది. అంతేకాదు హీరో రామ్ కెరిర్‌లోనే అత్యధిక కలెక్షన్లను సాధించిన సినిమాగా ఇస్మార్ట్ శంక‌ర్‌ నిలిచింది.

అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన దిమాక్ ఖరాబ్ వీడియో సాంగ్‌ను యూట్యూబ్‌లో జీ మ్యూజిక్ సౌత్‌లో విడుదలయ్యింది. అయితే ఈ సాంగ్ ఎంత మంది అభిమానులను సొంతం చేసుకుందో అది చెప్పనక్కర్లేదు. వీడియో యూట్యూబ్‌్‌లో పెట్టిన 8 గంటలలోపే 17 లక్షలకు పైగా వ్యూస్‌ని సంపాదించుకుని రికార్డ్ వ్యూస్ దిశగా దూసుకెళ్తుంది.