“ఇస్మార్ట్ శంకర్” ట్విట్టర్ టాక్..అంతా ఒకెత్తు మణిశర్మ ఒకెత్తు.!

Thursday, July 18th, 2019, 01:10:28 PM IST

టాలీవుడ్ లో ఉన్న హీరోలకు తనదైన స్టైలిష్ మేకోవర్ జత చేసి ఎనలేని మాస్ ఇమేజ్ ను ఇవ్వడం దర్శకుడు పూరి జగన్నాథ్ సొంతం.ఇప్పటి వరకు తాను చేసిన సినిమాలు అన్నిటిలోను ప్రతీ హీరోతోనూ తన మార్క్ ను చూపిస్తూ వచ్చారు.సినిమా పరంగా విఫలం అయినా సరే హీరోకు మాత్రం మాస్ ఓ మంచి ఇమేజ్ ను పూరి ఇచ్చేవారు.కానీ గత కొంత కాలం నుంచి సరైన హిట్ లేకపోవడం పూరి అభిమానులను కలవరపెడుతుంది.ఇదే నేపథ్యంలో హీరో రామ్ తో చేసిన “ఇస్మార్ట్ శంకర్” చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక్కడ నమ్మశక్యం కానీ విషయం ఏమిటంటే సినిమా ఫలితం ఎలా ఉండబోయినా సరే ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్సవ్వకుండా థియేటర్లలోనే చూస్తామని మాస్ ఆడియెన్స్ మరియు ముఖ్యంగా యువత అత్యధిక ఆసక్తిని కనబరుస్తున్నారు.ట్విట్టర్ లో అయితే ఇస్మార్ట్ హంగామా మాములుగా లేదు.మాస్ అభిమానులకు ఈ చిత్రం పండగ అని పూరి ఖాతాలో చాన్నాళ్లకు సరైన హిట్టు పడిందని మరి కొంతమంది అయితే తమకు ఏం అర్ధం కావడం లేదని అంటున్నారు.

కానీ కామన్ గా మాత్రం ప్రతీ ఒక్కరు చెప్తుంది మణిశర్మ సంగీతం కోసమే..మామాలుగానే మణిశర్మ పాటలన్నా ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నా విపరీతంగా ఇష్టపడే ఆడియెన్స్ ఉన్నారు.ఏఈ చిత్రాన్ని చూసిన వారైతే మాత్రం మణిశర్మ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ నుంచి బయటకు రాలేకపోతున్నామని అంత మాస్ బీట్ లతో అదరగొట్టేసారని ప్రశంసలు కురిపిస్తున్నారు.మొత్తానికి పూరి మరియు రామ్ లు మాస్ యుఫొరియా అంటే ఏమిటో చూపించేలానే ఉన్నారు.