కేవలం నాలుగు రోజుల్లోనే 4.9 మిలియన్ వ్యూస్ కొల్లగొట్టిన జబర్దస్త్ ప్రోమోస్.!

Tuesday, October 2nd, 2018, 08:40:19 PM IST

బుల్లితెర మీద ఈనాడు ఛానెల్లో ప్రతీ గురువారం మరియు శుక్రవారం ప్రసారమయ్యే జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ షోలకు వచ్చే ప్రజాధరణే వేరు అని చెప్పాలి.ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు పగలంతా కష్టపడి రాత్రి ఇంటికి వచ్చే సరికి వారి కష్టాలన్నింటినీ నవ్వుల రూపంలో పోగొట్టేస్తాయి ఈ రెండు ప్రోగ్రాములు.ప్రతీ గురువారం శుక్రవారం ప్రతీ తెలుగు ప్రేక్షకులు రాత్రి 9:30కి ఈటీవీ ఛానల్ కు అతుక్కుపోతారు.

టీఆర్పీలోనే కాకుండా ఈ షోలు ఇప్పుడు యూట్యూబ్ లో కూడా దుమ్ము దులిపేస్తున్నాయి.వచ్చే గురువారం,శుక్రవారం ఎపిసోడ్ల తాలూకా ప్రోమోలను ఒక్క రోజు తేడాతో నాలుగు రోజుల క్రితం యూట్యూబ్ లో పెట్టడం జరిగింది.ఇప్పటి వరకు ఏ ప్రోమోలకు రాని విధంగా ఈ రెండు ప్రోమోలకు కలిపి 4.9 మిలియన్ వ్యూస్(49 లక్షలు) మంది వీక్షించారు.ఇప్పటి వరకు ఏ ప్రోమోల విషయంలో ఇది జరగలేదు.దీన్ని బట్టి ఈ వారం ప్రచురితం కాబోయే ఈ రెండు షోలు భారీ స్థాయిలోనే టీఆర్పీ రేటింగులను కొల్లగొట్టేలా ఉన్నాయి.

ప్రతీ గురువారం శుక్రవారం తెలుగు ప్రేక్షకులు రాత్రి 9:30కి ఈటీవీ ఛానల్ కు అతుక్కుపోతారు.

ఇప్పటి వరకు ఏ ప్రోమోలకు రాని విధంగా ఈ రెండు ప్రోమోలకు కలిపి 4.9 మిలియన్ వ్యూస్(49 లక్షలు) మంది వీక్షించారు.ఇప్పటి వరకు ఏ ప్రోమోల విషయంలో ఇది జరగలేదు.వీటిలో జబర్దస్త్ ప్రోమోకు గాను 2మిల్లియన్లు,ఎక్స్ట్రా జబర్దస్త్ షోకు 2.9 మిల్లియన్లు వ్యూస్ వచ్చాయి.దీన్ని బట్టి ఈ వారం ప్రచురితం కాబోయే ఈ రెండు షోలు భారీ స్థాయిలోనే టీఆర్పీ రేటింగులను కొల్లగొట్టేలా ఉన్నాయి.