బాలీవుడ్ ట్రెండింగ్ మ్యాట‌ర్.. శ్రీదేవి కూతుర్ని వ‌ద‌ల‌డంలేదే..?

Wednesday, October 24th, 2018, 08:23:36 PM IST

వెండితెర అతిలోక సుంద‌రి శ్రీదేవి.. త‌న పెద్ద కూతురు బాలీవుడ్ ఎంట్రీ చిత్రం ధ‌డ‌క్ విడుద‌ల కాకుండానే అకాల మ‌ర‌ణం చెందిన విష‌యం తెలిసిందే. అయితే ఈ ఏడాది జూలైలో విడుద‌లైన ధ‌డ‌క్ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ప‌ర్వాలేద‌నిపించింది. అయితే ఆ చిత్రంలో న‌టించిన జాన్వీ క‌పూర్‌కి మాత్రం మంచి పేరొచ్చింది. ధ‌డ‌క్ చిత్రంలో జాన్వీ యాక్టింగ్, గ్లామ‌ర్‌కి కుర్ర‌కారు ఫిదా అయిపోయారు. దీంతో బాలీవుడ్‌లో ఈ భామ‌కు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే బాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత అయిన క‌ర‌ణ్ జోహార్ ధ‌డ‌క చిత్రాన్ని నిర్మించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ చిత్రం పెద్ద‌గా ఆడ‌క‌పోయే స‌రికి.. జాన్వీని స్టార్‌ని చేసే బాధ్య‌త క‌ర‌ణ్ త‌న భుజాల మీద వేసుకున్నాడనే టాక్ బీటౌన్‌ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో జాన్వీతో వ‌రుస‌గా మ‌రో రెండు చిత్రాలు చేస్తున్నాడు క‌ర‌ణ్. ఇక ఇప్ప‌టికే ఒక చిత్రం సెట్స్ పైకి వెళ్ళి షూటింగ్ జ‌రుపుకుంటుండ‌గా.. జాన్వీ కోసం మ‌రో చిత్రాన్ని సెట్ చేసి పెట్టాడు క‌ర‌ణ్. థ్రిల్ల‌ర్ నేప‌ధ్యంలో సాగే ఈ సినిమాని ధ‌డ‌క్ డైరెక్ట‌ర్ శ‌శాంక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడ‌ని స‌మాచారం. దీంతో జాన్వీ క‌పూర్‌ని స్టార్‌ని చేసే వ‌ర‌కు క‌ర‌ణ్ జోహార్ ఆమెను వ‌దిలేలా లేడ‌ని బాలీవుడ్ వ‌ర్గాల్లో చర్చించుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments