వీడియో: ఫిలింఫేర్ లో జాన్వీ విన్యాసాలు

Wednesday, February 13th, 2019, 02:16:10 PM IST

ప్ర‌తిష్ఠాత్మ‌క ఫిలింఫేర్ ఉత్స‌వాలు ముంబైలో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగాయి. ఈ వేడుక‌ల్లో టాప్ హీరోయిన్స్ కొలువుదీరి అవార్డుల‌కు కొత్త క‌ళ తెచ్చారు. ఇందులో రేఖ‌, బిపాసా బ‌సు, ప్రీతి జింతా, క‌రీనా క‌పూర్ వంటి సీనియ‌ర్ భామ‌ల సంద‌డితో పాటు శ్ర‌ద్ధా క‌పూర్, సోన‌మ్ క‌పూర్, సోనాక్షి, జాన్వీ క‌పూర్, ఊర్వ‌శి రౌతేలా వంటి కుర్ర‌ భామ‌లు ఓ రేంజులో వేదిక వ‌ద్ద సంద‌డి చేశారు. వీళ్లంద‌రిలో ఓ స్పెష‌ల్ బ్యూటీ విన్యాసాల‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది.

క‌ళ్లు మిరుమిట్లు గొలిపిన ఈ వేడుక‌లో ఎంద‌రు ఉన్నా అంద‌రి క‌ళ్లు జాన్వీపైనే. ఈ భామ స్పెష‌ల్ అప్పియ‌రెన్స్ తో అహూతుల క‌ళ్లు తిప్పుకోనివ్వ‌ని ట్రీట్ ఇచ్చింది. ప్ర‌ఖ్యాత డిజైన‌ర్స్ రూపొందించిన‌ స్పెష‌ల్ ఛ‌మ్కీ డ్రెస్ లో స‌ర్ప‌క‌న్య‌ను త‌ల‌పించింది. ఇక ఈవెంట్ వ‌ద్ద ఫోటోగ్రాఫ‌ర్ల‌కు కావాల్సిన విధంగా ఫోజులిచ్చిన జాన్వీ ర‌క‌ర‌కాల భంగిమ‌లతో మైమ‌రిపించింది. ఫోటోల కోసం అనుకూలంగా మారేందుకు జాన్వీ నానా తంటాలే ప‌డింది. ఓ సంద‌ర్భంలో త్రాచు ప‌క్క‌కు క‌దిలిన చందంగా అటూ ఇటూ మూవ్ అయిన వీడియో ప్ర‌స్తుతం జోరుగా వైర‌ల్ అవుతోంది. అస‌లే ధ‌డ‌క్ చిత్రంతో విజ‌యం అందుకుని, ప్ర‌స్తుతం కెరీర్ ప‌రంగా బిగ్ రేంజును ఆశిస్తున్న ఈ భామ ఇలా అవార్డు వేదిక‌లు, ఫోటోషూట్ల‌లో రాటు దేలిపోతోంది. మామ్ శ్రీ‌దేవి ఇచ్చిన టిప్స్, క‌ర‌ణ్ జోహార్ ఇచ్చిన టిప్స్ ని జాన్వీ ప‌క్కాగా ఫాలో అయిపోతోంద‌ని అర్థ‌మ‌వుతోంది. మ‌రోవైపు జాన్వీ టాలీవుడ్ లో ఆరంగేట్రం చేయ‌బోతోంద‌ని, రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ ఆర్.ఆర్.ఆర్ లో న‌టించే ఛాన్సుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. ముంబై టు టాలీవుడ్ ఈ అమ్మ‌డి రాక‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. జాన్వీ ప్ర‌స్తుతం త‌క్త్ అనే భారీ హిస్టారిక‌ల్ చిత్రంలో న‌టించ‌నుంది. క‌ర‌ణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.