వీర రాఘవ రెడ్డి బాహుబలి రికార్డులను కూడా వదల్లేదు.!

Friday, October 12th, 2018, 04:00:27 PM IST

ప్రపంచవ్యాప్తంగా నిన్న ఎన్నో అంచనాల నడుమ విడుదలైన “అరవింద సమేత వీర రాఘవ” చిత్రం తో ఆ చిత్ర హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి టాక్ సంపాదించుకొని బాక్సఆఫీస్ వద్ద తన దమ్మెంటో మరో సారి చూపిస్తున్నాడు.తారక్ కి ముందే మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.దానికి తోడు త్రివిక్రమ్ తో మొట్టమొదటి కాంబినేషన్ అందులోను రాయలసీమ నేపధ్య కథ.ఇన్ని మాస్ ఎలిమెంట్స్ ఉంటే ఇక తారక్ యొక్క ప్రభంజాన్ని బాక్సాఫీస్ వద్ద అసలే ఆపలేం,అందుకు నిదర్శనంగా అరవింద సమేత చిత్రానికి వస్తున్న వసూళ్లునే చెప్పొచ్చు.

ఓవర్సీస్ లో బాహుబలి రికార్డులను టచ్ చేయలేకపోయినా ఆంధ్ర మరియు తెలంగాణలో కొన్ని చోట్ల ఐతే బాహుబల2 రెకార్డులకే బీటలు తెప్పించేసింది.అరవింద సమేత చిత్రం నైజాం,సీడెడ్,కృష్ణ తదితర ప్రాంతాల్లో బాహుబలి రికార్డులను సైతం బద్దలుకొట్టేసింది.నైజాం ఏరియాలో అయితే బాహుబలి1 మరియు సీడెడ్ ప్రాంతంలో అయితే బాహుబలి2 రికార్డులను కూడా దాటేసినట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకున్నట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణా ఇరు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 27 కోట్ల షేర్ రాబట్టినట్టు తెలుస్తుంది.దీనితో ఇరు రాష్ట్రాల్లో కలిపి నాన్ బాహుబలి రికార్డును నమోదు చేసినట్టు తెలుస్తుంది.