ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిందా ?

Monday, September 19th, 2016, 12:28:40 PM IST

NTR-NEW
”జనతా గ్యారేజ్” సినిమాతో మంచి హిట్ అందుకున్న ఎన్టీఆర్, తన నెక్స్ట్ సినిమాకి అప్పుడే సన్నాహాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ఇప్పటికే ఇద్దరు ముగ్గురు దర్శకులు సిద్ధంగా ఉన్నారు. పూరి జగన్నాధ్, తమిళ దర్శకుడు లింగుస్వామి, లేటెస్ట్ గా ‘పటాస్’ దర్శకుడు అనిల్ రావిపూడిలు క్యూ లో ఉన్నారు, వీరిలిస్ట్ లోకి లేటెస్ట్ గా బోయపాటి శ్రీను కూడా చేరాడు. గతంలో ఎన్టీఆర్ తో దమ్ము చిత్రాన్ని తీసిన విషయం తెలిసిందే. అయితే ఈ నాలుగు ప్రాజెక్ట్స్ లో ఎన్టీఆర్, పూరి జగన్నాధ్ తో సినిమా చేయడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. పూరి ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తో ”ఇజం” చిత్రాన్ని తీస్తున్నాడు, ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి అటు పూరి కూడా సిద్దంగానే ఉన్నాడట. సో వచ్చే నెలలో వీరి సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని తాజా సమాచారం.