ఫిలింన‌గ‌ర్ టాక్‌: ఎన్టీఆర్ ఆస్తులు 1600 కోట్లు?

Sunday, November 13th, 2016, 05:44:34 PM IST

ntr
న‌ల్ల డ‌బ్బు ర‌ద్దు నేప‌థ్యంలో టాలీవుడ్‌లోని పలువురు ప్ర‌ముఖుల ఆస్తుల‌పై ఆరాలు మొద‌ల‌య్యాయి. ఏ హీరోకి ఎంత ఆస్తి ఉంది? ఎవ‌రెవ‌రు ఎక్క‌డెక్క‌డ దాచిపెట్టారు? అంటూ సినిమా వ‌ర్గాల్లోనే చ‌ర్చ సాగుతుండ‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ఆ ప్ర‌కారం టాలీవుడ్‌లోనే అత్యంత ధ‌నికుడైన హీరోగా ఎన్టీఆర్ పేరు టాప్‌-10లో ఉందంటూ ప్ర‌చారం సాగుతోంది. ఓ లెక్క ప్ర‌కారం ఎన్టీఆర్ మొత్తం ఆస్తులు 1600 కోట్లు ఉంటుంద‌నేది అంచ‌నా.

ఎన్టీఆర్ దేశంలోని ధ‌న‌వంతుల జాబితాలో 66వ స్థానంలో ఉన్నారు. తండ్రి వార‌స‌త్వంగా సొంత‌ ఆస్తులు 450 కోట్లు .., మామ (నార్నే ఎస్టేట్స్-స్టూడియో ఎన్‌ అధినేత నార్నే శ్రీ‌నివాస‌రావు) ద్వారా వ‌చ్చిన ఆస్తులు 250 కోట్లు.. ఈ మొత్తమే 700 కోట్ల‌కు చేరింద‌న్న‌ది ఓ అంచ‌నా. వైఫ్‌ నార్నేల‌క్ష్మి ప్ర‌ణ‌తితో ఎన్టీఆర్ వివాహం 2011లో జరిగింది. ల‌క్ష్మి ప్ర‌ణ‌తి చంద్ర‌బాబుకు స్వ‌యానా మేన‌కోడ‌లు. అందువ‌ల్ల భార్య పేరునా భారీగా ఆస్తులున్నాయి. మ‌హాబ‌లిపురం, ఫిలింన‌గ‌ర్, హైద‌రాబాద్‌ ప‌రిస‌రాల్లో 45-75 కోట్ల విలువ చేసే ఆస్తులు ఎన్టీఆర్‌కి ఉన్నాయ‌న్న ప్ర‌చారం సాగుతోంది. మోదీ పుణ్య‌మా అని ప్ర‌స్తుతం టాలీవుడ్ హీరోల ఆస్తుల‌పై జ‌నాల్లో ఒక‌టే డిష్క‌స‌న్ స్టార్ట‌య్యింది.