ఎన్టీఆర్ బయోపిక్ లో జూనియర్ ఎన్టీఆర్ ?

Monday, October 22nd, 2018, 08:55:13 PM IST

ఏంటి షాక్ అవుతున్నారా ? మీరు వింటున్నది నిజమే .. !! దివంగత నేత, సూపర్ స్టార్ ఎన్టీఆర్ జీవిత కథతో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ జోరుగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. ఇప్పటికే పలువురు క్రేజీ నటీనటులను రంగంలోకి దింపి ఈ ప్రాజెక్ట్ పై క్రేజ్ పెంచేసాడు బాలయ్య. తాజాగా మరో సంచలన వార్త ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.. ఇదేమిటంటే … ఈ సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఓ పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయట. ఇప్పటి వరకు పలు పాత్రల్లో పలువురు నటీనటులను ఎంపిక చేసిన బాలయ్య ..

ఈ సినిమాలో తన పాత్ర అదే ఎన్టీఆర్ కొడుకు బాలకృష్ణ పాత్రను మాత్రం ఎంపిక చేయలేదు .. ఇప్పుడు ఆ పాత్రను ఎన్టీఆర్ తో చేయించాలని ప్లాన్ చేస్తున్నారట. హరికృష్ణ మృతి తరువాత బాలయ్య.. ఎన్టీఆర్ ఒక్కటయ్యారు. ఇన్నాళ్లు వాళ్ళ మధ్య ఉన్న పొరపొచ్చాలన్నీ తొలిగిపోయాయని తాజగా అరవింద సమేత సక్సెస్ మీట్ తెలిపింది. ఎన్నడూ లేనిది బాలయ్య , ఎన్టీఆర్ సినిమా విజయోత్సవానికి గెస్ట్ గా రావడంతో నందమూరి అభిమానుల్లో ఆనందం నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సినిమాలో జూనియర్ కోసం తన రోల్ చేయమని చెప్పినట్టు టాక్ ? చూద్దాం మరి ఏమి జరుగుతుందో.

  •  
  •  
  •  
  •  

Comments