“తలైవి” లో జూనియర్ ఎన్టీఆర్ – నిజమేనా…?

Wednesday, November 20th, 2019, 07:09:07 PM IST

ప్రస్తుతానికి మన సినీ పరిశ్రమలో బయోపిక్ ల హవా నడుస్తుందని చెప్పాలి. దాదాపుగా మన దర్శకులు కూడా కొందరు ప్రముఖుల బయోపిక్ లను తెరకెక్కించడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. కాగా ఈమేరకు ప్రస్తుతానికి దివంగత ‘తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా కూడా ఒక బయోపిక్ సిద్ధం అవుతుంది. కానీ అది ఒక్కటి కాదు, జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా రెండు చిత్రాలు రానున్నాయి. అందులో ఒకటి కంగనా రనౌత్ ప్రధాన జయలలిత పాత్రలో నటిస్తున్నటువంటి “తలైవి” చిత్రం… ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబందించిన ఒక లేటెస్ట్ వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తుంది.

కాగా జయలలిత జీవితాన్ని తెరమీద చూపించడం అంటే అది ఒక సాహసం గానే చెప్పాలి. అటు సినిమాలు, ఆ తరువాత రాజకీయాల్లో తనదైన ముద్ర వేసినటువంటి జయలలిత జీవితంలో ఎంతో మంది ప్రముఖులతో కలిసి పనిచేశారు. కాగా అందులో మన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూడా ఒకరు. కాగా తలైవి చిత్రంలో ఎన్టీఆర్ పాత్రకి తగ్గ వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ అని అందరు భావిస్తున్నారంట. అయితే ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తో తలైవి చిత్ర బృందం సంప్రదించినప్పటికీ కూడా ఎన్టీఆర్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదని సమాచారం. ఇకపోతే గతంలో కూడా తన తాత ఎన్టీఆర్ పాత్రలో నటించడానికి చాలా మంది దర్శకనిర్మాతలు ఎన్టీఆర్ ని సంప్రదించినప్పటికీ కూడా, ఎన్టీఆర్ ఏనాడూ తన తాత పాత్రలో కనిపించడానికి అంగీకరించలేదు. కాగా ఈ తలైవి చిత్ర విషయంలో ఎన్టీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అని అందరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.