అభిమానులకు ఎన్టీఆర్ బహిరంగ లేఖ…ఎందుకంటే?

Wednesday, May 19th, 2021, 01:00:36 PM IST

జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులకు బహిరంగ లేఖ రాశారు. ఇటీవల కరోనా వైరస్ సోకడం తో ఐసోలేషన్ లో ఉంటున్నారు ఎన్టీఆర్. అయితే కరోనా వైరస్ సోకింది అని తేలడం తో అభిమానులు భారీగా సందేశాలను, వీడియో లను పంపడం జరిగింది. అయితే అందుకు ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాక ఈ ఏడాది మే 20 తన పుట్టిన రోజు కావడం తో ఏ విధమైన వేడుకలు చేయవద్దు అంటూ చెప్పుకొచ్చారు. అందరూ కూడా ఇంటివద్ద నే అంటూ లాక్ డౌన్ కర్ఫ్యూ నిబంధనలను పాటించండి అంటూ చెప్పుకొచ్చారు. ఇదే మీరు నాకు అందించే అతి పెద్ద కానుక అని అన్నారు. అయితే ప్రస్తుతం తాను ఆరోగ్యం గానే ఉన్నా అని వ్యాఖ్యానించారు.త్వరలో కరోనా వైరస్ భారీ నుండి పూర్తి గా కోలుకుంటా అంటూ చెప్పుకొచ్చారు.

అయితే ఎన్టీఆర్ రాసిన బహిరంగ లేఖ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. మరొక పక్క ఎన్టీఆర్ వరుస సినిమా లతో అభిమానులను అలరించేందుకు సిద్దం అవుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరెక్కుతున్న రౌద్రం రణం రుధిరం చిత్రం లో కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. రామ్ చరణ్ ఈ చిత్రం లో మరొక హీరో గా అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం అనంతరం కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్ లతో పాటుగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు.