జూనియర్ ఎన్టీఆర్‌కు కరోనా పాజిటివ్..!

Monday, May 10th, 2021, 04:47:55 PM IST


కరోనా మహమ్మారి రోజు రోజుకు ఎంతలా విజృంభిస్తుందో పెద్దగా చెప్పనక్కర్లేదు. సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు ఇలా ఏ ఒక్కరిని కరోనా విడిచిపెట్టడం లేదు. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోలు ఒక్కొక్కరిగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా జూనియరే ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

అయితే తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, ఎలాంటి సమస్య లేదని, నేను బాగానే ఉన్నానని, తాను తన కుటుంబం అంతా ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నామని, నిరంతరం వైద్యుల సంరక్షణలో చికిత్స తీసుకుంటున్నామని అభిమానులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని జూనియర్ చెప్పుకొచ్చాడు. అయితే గత కొన్ని రోజులుగా నన్ను సంప్రదించిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని ఎన్టీఆర్ సూచించారు.