హాట్ టాపిక్ : రాంచరణ్ కి జీవితంలో మరిచిపోలేని సర్ప్రైజ్ ఇస్తానంటున్న ఎన్టీఆర్…ఏమై ఉంటుంది!

Thursday, March 26th, 2020, 07:53:56 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శుక్రవారం పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండనున్నారు. అయితే రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ రౌద్రం రణం రుదీరం లో నటిస్తున్నారు. అయితే ఈచిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, కొమరం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటిస్తుండటం తో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ తాజాగా విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ మోషన్ పోస్టర్ లోనే టైటిల్ నీ సైతం తెలియజేశారు.

అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ నీ ఉద్దేశిస్తూ ఒక పోస్ట్ చేశారు. అయితే ప్రజలంతా లాక్ డౌన్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే పుట్టిన రోజుని సరైన పరిస్తితుల్లో జరుపుకొలేని సంగతిని తెలుపుతూ, రామ్ చరణ్ కి ఒక సర్ప్రైజ్ ఇవ్వనున్నారని తెలుస్తుంది. రేపు ఉదయం 10 గంటలకు డిజిటల్ సర్ప్రైజ్ ఇస్తున్నా, నన్ను నమ్ము, మీరు ఎప్పటికీ మర్చిపోలేని బ్యాంగ్ ఇస్తున్నా అని అన్నారు. రాజమౌళి చిత్రం నుండి విడుదల కానున్న టీజర్ లేదా ఫస్ట్ లుక్ అయి ఉంటుంది అని అందరూ భావిస్తున్నారు.