ట్రెండింగ్‌ : ‘క‌బాలి’ రికార్డులు ‘కాలా’ కొట్టేస్తాడా?

Wednesday, February 28th, 2018, 11:37:03 PM IST

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించే సినిమా టీజ‌ర్ వ‌స్తోంది అంటే అభిమానులంతా చ‌కోర ప‌క్షుల్లా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో సైర‌న్ మోగుతుంది. మార్చి 1న `కాలా` టీజ‌ర్ వ‌స్తోంది అని ప్ర‌క‌టించ‌గానే ర‌జ‌నీ ఫ్యాన్స్‌లో ఒక‌టే ఎగ్జ‌యిట్‌మెంట్‌. అయితే ఆ ఎగ్జ‌యిట్‌మెంట్‌కు తెర‌దించేందుకు రేపటి ఉద‌య‌మే కాలా-క‌రికేయ‌న్ టీజ‌ర్ రిలీజ్ కాబోతోంది.

ఈ టీజ‌ర్‌ని యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌లో లైవ్ చేసేందుకు రెడీ చేస్తున్నారు. అయితే ఈ టీజ‌ర్ క‌బాలి టీజ‌ర్ రికార్డుల్ని తిర‌గ‌రాస్తుందా? అంటూ లైవ్‌లో డిబేట్ ర‌న్ అవుతోంది. అభిమానులు కాలా టీజ‌ర్‌పై భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. క‌బాలి రిలీజైన కొన్ని గంట‌ల్లోనే కోట్లాది వ్యూస్‌ని సాధించింది. యూట్యూబ్ , ఫేస్‌బుక్‌ల‌ను ఠారెత్తించింది. దాదాపు 3.5 కోట్ల మంది క‌బాలి టీజ‌ర్‌ని వీక్షించారు. ఇప్పుడు ఆ రికార్డును కాలా టీజ‌ర్ బ్రేక్ చేస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. జియో, టెలీకాం పోటీ లేన‌ప్పుడు, ఇంట‌ర్నెట్ పూర్తిగా అందుబాటులో లేన‌ప్పుడే క‌బాలి అన్ని రికార్డులు తిర‌గ‌రాసింది. ఇప్పుడు కాలా అంత‌కుమించి రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇత‌ర సినిమాల టీజ‌ర్ల ఫేక్ రికార్డుల్ని ఈ టీజ‌ర్ బ్రేక్ చేస్తుంది అంటూ ర‌జ‌నీ అభిమానులు సామాజిక మాధ్య‌మాల్లో కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి క‌బాలిని కొట్టే రేంజులో కాలా వ‌స్తున్నాడా? అన్న‌ది రేప‌టి టీజ‌ర్ తేల్చి చెప్ప‌బోతోంద‌న్న‌మాట‌!