ముదర హీరోతో ఈ లిప్ లాకులు ఏంటి?

Wednesday, June 5th, 2019, 04:17:02 PM IST

“అర్జున్ రెడ్డి” అనే ఒక సినిమాతో టాలీవుడ్ విజయ్ దేవరకొండ సంచలన హీరోగా మారిపోయాడు.ఆ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి విడుదలయ్యేంత వరకు ఎన్ని వివాదాల్లో ఇరుక్కుందో అందరికీ తెలుసు.మరీ ముఖ్యంగా పెదవి ముద్దు పోస్టర్ వల్ల అయితే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా ఈ సినిమా విషయంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.ఏది ఏమైనప్పటికీ విడుదల అయిన తర్వాత మాత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.ఇదే సినిమాను హిందీలో కూడా సందీప్ షాహిద్
కపూర్ మరియు కియారా అద్వానీ లతో ఎక్కడా తగ్గకుండా అక్కడ కూడా చాలా బోల్డ్ గానే తెరకెక్కిస్తున్నారు.

అందులో భాగంగానే అర్జున్ రెడ్డికి ఎలాంటి పోస్టర్ ను డిజైన్ చేసారో కబీర్ సింగ్ కు కూడా అలాంటి పోస్టర్ రిలీజ్ చెయ్యడంతో బాలీవుడ్ కి చెందిన వివాదాస్పద విమర్శకుడు కమాల్ర్ ఖాన్ ఈ పోస్టర్ ను హేళన చేస్తూ ఒక కామెంట్ పెట్టారు.అంత పెద్ద ఏజ్ ఉన్న నటుడితో చిన్న ఏజ్ ఉన్న హీరోయిన్ తో ముద్దు పెట్టించి ఇలాంటి పోస్టర్ రిలీజ్ చెయ్యడం ఏమిటని దీనిపై తానేమి మాట్లాడుదలచుకోలేదని,కానీ సినిమా పబ్లిసిటీ కోసం ఇలా బూతు పోస్టర్లను విడుదల చేసుకుంటున్నారని ట్వీట్ పెట్టి అక్కడ కూడా సంచలనం రేపారు.దీనితో అభిమానులు కూడా కమాల్ కు గట్టిగానే రిప్లై ఇస్తున్నారు.కొంతమంది అయితే పట్టుంచుకోవడమే లేదు.