ఆ సినిమాలో కాజ‌ల్ బికినీ వేసిందా?

Tuesday, September 20th, 2016, 11:59:59 AM IST

kajal
ప‌రిస్థితి చూస్తుంటే కాజ‌ల్ ఇక కుర్రాళ్ల‌ని నిద్ర‌పోనివ్వ‌కూడ‌ద‌ని డిసైడ‌యిన‌ట్టే అనిపిస్తోంది. ఇన్నేళ్లుగా క‌థానాయిక‌గా ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతున్న ఆమె ఎప్పుడూ ఎక్స్‌పోజింగ్ ప‌రంగా హ‌ద్దులు దాట‌లేదు. చివ‌రాఖ‌రికి ఐటెమ్ పాట‌ల‌కి కూడా ఆమ‌డ దూరంలో ఉండేది. కెరీర్ చివ‌రి ద‌శ‌కు చేరుకొంద‌న్న భావ‌నో లేదంటే ఇప్పుడు కాక‌పోతే ఇంకెప్పుడు గ్లామ‌ర్‌గా క‌నిపిస్తాం అన్న తెగువో ఏంటో తెలియ‌దు కానీ ఇటీవ‌ల మాత్రం రెచ్చిపోతోంది. ఎన్టీఆర్ సినిమాలో ఈమ‌ధ్యే ఐటెమ్ పాట చేసి
అందాలొలికించిందా? ఆ పాట చూసి వ‌హ్వా కాజ‌ల్ అన్నారు కుర్ర‌కారు. ఇప్పుడు ఏకంగా బికినీతోనూ సోకుల్ని ప్ర‌ద‌ర్శించేందుకు కూడా సిద్ధ‌మైన‌ట్టు స‌మాచారం. త‌మిళ క‌థానాయ‌కుడు జీవాతో క‌లిసి త‌మిళంలో ఓ చిత్రం చేసింది. అది తెలుగులోనూ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఆ సినిమాకి కాజ‌ల్ గ్లామ‌రే హైలెట్‌గా నిలుస్తుంద‌ట‌. ఒక పాట‌లో ఆమె బికినీ కూడా వేసుకొని క‌నిపిస్తుందని ప్ర‌చారం సాగుతోంది. మ‌రి అది ఎంత‌వ‌ర‌కు నిజ‌మో చూడాలి. అయితే కొన్నాళ్ల‌నుంచి నెట్‌లో మాత్రం ఓ వీడియో నెట్‌లో వైర‌ల్ అవుతోంది. ఒక లోయ ద‌గ్గ‌ర కాజ‌ల్ చిట్టి గౌను వేసుకొని పైకి ఎగిరే స‌న్నివేశాన్ని తెర‌కెక్కిస్తున్న‌ప్ప‌టి వీడియో అది. అందులో కాజ‌ల్ గౌను పైకి ఎగురుతుంటే ప‌క్క‌నే జీవా క‌నిపిస్తాడు. ఆ వీడియోని చూస్తేనే కాజ‌ల్ ఏ స్థాయిలో గ్లామ‌ర్ ప్ర‌ద‌ర్శించ‌నుందో అర్థ‌మ‌వుతోంది. తెలుగులో ఆ
సినిమాని విడుద‌ల చేస్తున్న నిర్మాత‌లు కూడా కాజ‌ల్ గ్లామ‌ర్‌నే చూపిస్తూ బిజినెస్ చేస్తున్నార‌ని స‌మాచారం.