హీరోయిన్స్ లో ఈ రికార్డు కొట్టేసిన కాజు.!

Friday, June 19th, 2020, 08:10:49 PM IST

నేడు మన టాలీవుడ్ సీనియర్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే నడుస్తుంది. మాములుగా హీరోలకు తమ ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఆన్ లైన్ సెలబ్రేషన్స్ జరుపుతారో అదే విధంగా ఇప్పుడు మన టాలీవుడ్ అగ్ర హీరోయిన్స్ కు కూడా అంతే స్థాయిలో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఆన్లైన్ సంబరాలు అంటే అది జరిగేది ట్విట్టర్ లోనే.

ఇంకా 6 గంటల సమయం మిగిలి ఉండగానే కాజల్ అగర్వాల్ ఫ్యాన్స్ అంతకు ముందు ఉన్న హీరోయిన్స్ ఫ్యాన్స్ సెట్ చేసిన ట్వీట్స్ రికార్డును బద్దలు కొట్టేసారు. 24 గంటల్లో సమంత ఫ్యాన్స్ 2 లక్షల 54 వేల ట్వీట్స్ వెయ్యగా ఆ మొత్తాన్ని కాజల్ ఫ్యాన్స్ ఇంకా 6 ఉండగానే 2 లక్షల 80 వేలకు పైగా ట్వీట్స్ తో బద్దలు కొట్టేసారు. దీనితో ఈసారి ఈ రికార్డు కాజల్ చేతికి మారింది. హీరోయిన్ పుట్టిన రోజు వేడుకలను కూడా ఈ రేంజ్ లో చెయ్యడం విశేషమే అని చెప్పాలి.