బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టిన‌.. టాలీవుడ్ చందమామ‌.. ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్..!

Monday, October 29th, 2018, 02:45:09 PM IST

టాలీవుడ్ చందమామ కాజ‌ల్ అగ‌ర్వాల్ బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టింద‌నే వార్త సినీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. కాజ‌ల్ సినీ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ద‌శాబ్దం పైనే అయినా ఈ ముద్దుగుమ్మ‌కి అవ‌కాశాలు మాత్రం త‌గ్గ‌డంలేదు. కాజల్ కెరీర్ చివ‌రి ద‌శ‌కు చేరుకున్నా వ‌రుస‌గా ఒక‌వైపు యండ్ హీరోల‌తో.. మ‌రోవైపు స్టార్ హీరోల సర‌స‌న అవ‌కాశాలు కొట్టేస్తూ సినీ వ‌ర్గాల్ని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. గ‌త ఏడాది మెగాస్టార్ రీ ఎంట్రీ చిత్ర ఖైదీ నెం150తో మెరిసిన కాజల్.. ఆ త‌ర్వాత త‌మిళ్ స్టార్ హోరో అజిత్‌తో వివేగం చిత్రంలో న‌టించింది. ఇక ఆ త‌ర్వాత మ‌రో త‌మిళ స్టార్ హీరో విజ‌య్‌తో మెర్స‌ల్ చిత్రంతో మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలోకి వేసుకుంది.

ఇక అదే టైమ్‌లో రానాతో నేనే రాజు నేనే మంత్రి, కాళ్యాణ్ రామ్‌తో ఎమ్మెల్యే, కొత్త ద‌ర్శ‌కుడితో “అ!” మూవీలో నటించింది కాజ‌ల్. ప్ర‌స్తుతం కాజ‌ల్ చేతిలో తెలుగు, త‌మిళ భాషల్లో క‌లిపి నాలుగు చిత్రాలు ఉన్నాయి. అయితే తాజాగా మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌లో న‌టించే అవ‌కాశం వ‌చ్చింది ఈ టాలీవుడ్ చందమామ‌కి. విశ్వ‌న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్- సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన‌ భార‌తీయుడు చిత్రానికి సీక్వెల్ తీయ‌నున్నార‌నే సంగ‌తి తెలిసిందే. అయితే ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. ఈ చిత్రంలో క‌మ‌ల్ హాస‌న్ డ్యూయ‌ల్ రోల్‌లో న‌టిస్తున్నార‌ని టాక్. దీంతో ఈ చిత్రంలో ఒక హీరోయిన్‌గా కాజ‌ల్‌ను సెల‌క్ట్ చేశార‌ని స‌మాచారం. దీంతో కాజ‌ల్ జాక్ పాట్ కొట్టేసింద‌ని సినీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. ఏది ఏమైనా కేరీర్ చ‌ర‌మాంకంలో ఉన్న‌ కాజల్ భ‌లే చాన్స్ కొట్టేసిందని స‌ర్వత్రా చ‌ర్చించుకుంటున్నారు.