టాలీవుడ్ వైర‌ల్ లీక్స్‌.. ఇది నిజ‌మేనా కాజ‌ల్..?

Friday, November 2nd, 2018, 01:26:05 PM IST

టాలీవుడ్ చందమామ కాజ‌ల్ అగ‌ర్వాల్ సినీ ప‌రిశ్ర‌మ‌కి వ‌చ్చి ద‌శాబ్ద కాలం దాటినా ఇప్ప‌టికీ వ‌రుస అవ‌కాశాల‌తో బిజీ హీరోయిన్‌గా కొన‌సాగుతోంది. తెలుగు, త‌మిళ్ రెండు ఇండ‌స్ట్రీల్లో టాప్ హీరోల‌తోనూ, కుర్ర హీరోల‌తోనూ న‌టిస్తూ అంద‌రినీ ఆశ్చ‌ర్య ప‌రుస్తుంది కాజ‌ల్. ఇక తాజాగా విశ్వ‌న‌టుడు క‌మల్ హాస‌న్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన కాజ‌ల్, ప్ర‌స్తుతం తెలుగులో తేజ డైరెక్ష‌న్‌లో బెల్లంకొండ శ్రీనివాస్‌తో కలిసి న‌టిస్తోంది ఈ ముద్దుగుమ్మ‌. అయితే తాజాగా కాజ‌ల్‌కి సంబందించి ఒక వార్త టాలీవుడ్ స‌ర్కిల్లో గుస‌గుస‌లాడుకుంటున్నారు.

అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. కాజ‌ల్ ప్ర‌స్తుతం ఓ కుర్ర హీరోతో ప్రేమ‌లో మునిగి తేలుతుంద‌నే టాక్ వినిపిస్తోంది. ఒక‌వైపు వ‌రుస చిత్రాల‌తో ఉన్న కాజ‌ల్ మ‌రోవైపు ఆ కుర్ర హీరోతో డైటింగ్‌లో ఉంద‌ని.. ఈ క్ర‌మంలో కాజ‌ల్ అత‌నితో చెట్టాప‌ట్ట‌లు వేసుకుని మ‌రీ తిరుగుతోంద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ స‌ర్కిల్లో తెగ చ‌ర్చించుకుంటున్నారు. ఇక ఆ కుర్ర హీరో టాలీవుడ్ బ‌డా నిర్మాత త‌న‌యుడ‌ని.. త‌న కొడుకుని స్టార్‌ని చేయ‌డానికి భారీ బ‌డ్జెట్‌తో చిత్రాలు నిర్మిస్తున్నా స‌రైన హిట్ రాలేదు. ఇక ఆ కుర్ర హీరో మాత్రం వ‌రుస‌గా స్టార్ హీరోయిన్ల‌తోనే న‌టిస్తున్నాడు. అయితే ప్ర‌స్తుతం కాజ‌ల్‌తో న‌టిస్తున్న ఆ హీరో కాజ‌ల్ అందానికి ఫిదా అయిపోయాడ‌ని.. ఇద్ద‌రికీ మంచి బాండింగ్ ఏర్ప‌డింద‌ని.. దీంతో షూటింగ్ అయిపోవ‌డం ఆల‌స్యం ఇద్ద‌రూ బ‌య‌ట‌కు వెళ్ళి తెగ ఎంజాయ్ చేస్తున్నార‌ని స‌మాచారం. మ‌రి ఈ వార్త‌లో నిజ‌మెంత ఉందో తెలియ‌దు కానీ కాజ‌ల్ మాత్రం త‌న పని తాను చేసుకుంటుంది.

  •  
  •  
  •  
  •  

Comments