ఆ బిగ్ సినిమా నుంచి కాజల్ వెళ్ళిపోయిందిగా..!

Monday, June 3rd, 2019, 11:56:17 PM IST

త‌మిళంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో క‌మ‌ల్ హాస‌న్‌, దర్శకుడు శంక‌ర్ కలయికలో భార‌తీయుడు-2 అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ముందు వచ్చిన భారతీయుడు సినిమాను లంచగొండి తనాన్ని ఉద్దేశించి తెరకెక్కించారు. ఇందూలో సేతుపతి క్యారెక్టర్‌లో కమల్ హాసన్ నటించాడు. ఇందులో ద్విపాత్రాభినయం చేసిన కమల్ సరసన మనీషా కొయిరాలా, ఊర్మిలా మండోద్కర్ హీరోయిన్లుగా నటించారు.

అయితే ఇండియన్ 2 లో మాత్రం కమల్ హీరోగా నటిస్తున్నా, విలన్‌గా అక్షయ్ కుమార్ ఉన్నట్లు తెలిసింది. అంతేకాదు సౌత్ స్టార్స్ శింబు, దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, నయనతార ముఖ్యమైన పాత్రలలో నటించబోతున్నారని తెలుస్తుంది. అయితే భారీ బడ్జెట్‌తో ఇండియన్ సినీ చరిత్రలో ఇది మరో అతిపెద్ద మూవీగా నిలిచిపోతుందని అందరూ అనుకున్నారు. అయితే గత కొంత కాలంగా ఈ సినిమాకు షూట్‌కు బ్రేకులు పడింది. కమల్ హాసన్ మొన్నటి వరకు ఎన్నికలలో బిజీగా ఉండడం మరియు ఆయన బిగ్ బాస్‌లో హోస్ట్‌గా ఉండడం వలన షూటింగ్ చాలా రోజుల నుంచి ముందుకు వెల్లడంలేదు. అయితే గత కొద్ది కాలంగా తిరిగి ఈ సినిమాను షూట్ చేశే పనిలో ఉన్నారట. అయితే జూన్ నెల‌లో కాజ‌ల్ త‌న డేట్స్‌ను ఇత‌ర ప్రాజెక్ట్స్‌కు కేటాయించేసిందట‌. ఇప్పుడు భార‌తీయుడు-2 కోసం డేట్స్ కావాలంటే కాజ‌ల్‌కు ఏం చేయాలో అర్థం కావడం లేద‌ట‌. దీంతో ఇప్పుడు కాజల్ ఈ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకునే అవకాశం ఉందని, నయనతారను ఈ ప్రాజెక్టులోకి తీసుకోవాలని ఆలోచిస్తున్నారనే వార్తలు కోలీవుడ్‌లో విన‌ప‌డుతున్నాయి. ఇదే కనుక జరిగితే కాజల్ ఓ పెద్ద సినిమాను మిస్ చేసుకుంటుందనే చెప్పాలి.