మేకప్ లేకుండా కాజల్‌ని ఎప్పుడైనా చూశారా? ఇప్పుడు చూడండి..!

Saturday, June 1st, 2019, 08:07:55 PM IST


ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలుగుతున్న అందాల తారలలో కాజల్ ఒకరు. అయితే రీల్ లైఫ్‌లో ఎంతో అందంగా కనిపించే తారలు రియల్ లైఫ్‌లో కూడా అంతే అందంగా కనిపిస్తారా అంటే లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం మేకప్‌తోనే వారి వారి అందాలు మారిపోతుంటాయి. అయితే ఎక్కడో కొద్ది మంది మాత్రం మేకప్ ఉన్నా లేకున్నా అందంగానే కనిపిస్తుంటారు. అయితే ప్రస్తుతం నడుస్తున్న ఈ గ్లామర్ ప్రపంచంలో హీరోయిన్ల కెరిర్ సాఫీగా సాగాలంటే వారు అన్నిటికన్నా ముందు అందానికే ప్రాధాన్యత ఇవ్వల్సి ఉంటుంది.

అయితే హీరోయిన్లు మాత్రం ఎట్టి పరిస్థితులో మేకప్ లేకుండా భయటకు కనిపించరు. మేక‌ప్ లేకుండా త‌మ మొహాన్ని ప్రేక్ష‌కుల‌కు చూపించడానికి అసలు ఇష్టపడరు. మేకప్ లేకుండా అసలు ఫోటోలు కూడా తీసుకోరు అంటే నమ్మండి. మేకప్‌పైన వారు ఎంత ఆధారపడ్డారో అర్ధమవుతుంది. అయితే తాజాగా కాజల్ మాత్రం అసలు మేకప్ లేకుండా కొన్ని ఫోటోలను తీసుకుంది. అంతేకాదు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది. అయితే ధైర్యంగా భయాన్ని వీడి మేక‌ప్‌లేని ఫోటోలను పెడుతున్నా అంటూ ట్వీట్ కూడా చేసింది. శ‌రీరాక‌ర్ష‌ణ‌కు మాత్ర‌మే విలువ ఉన్న ప్ర‌పంచంలో జీవిస్తున్నాం. అందం అనేది ఉన్నది ఉన్నట్టుగా మనల్ని మనం స్వీకరించుకోవడమే అని, మేక‌ప్ మ‌న‌ల్ని బాహ్యంగా అందంగా త‌యారుచేస్తుందే తప్పా మ‌న వ్య‌క్తిత్వాన్ని మార్చలేదు అంటూ, ఏ విధంగా ఉన్నా మనల్ని మనం స్వీకరించడంలోనే ఆనదం ఉందని ట్వీట్‌లో పేర్కొంది కాజల్. ఏది ఏమైనా ధైర్యంగా మేకప్ లేని ఫోటోలను భయటపెట్టిన కాజల్‌కు ప్రస్తుతం అభిమానులు కూడా మీ ధైర్యానికి మెచ్చుకుంటున్నామని ప్రశంసలు కురిపిస్తున్నారట. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.