విశ్వరూపం 2 గురించి కమల్ మనసులో మాట

Friday, February 17th, 2017, 06:00:15 PM IST


యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఎన్ని సినిమాలు చేసినా ఒక సినిమాకీ మరొక సినిమాకీ మధ్యన పాత్ర ఒకలాగా ఉండదు. ఎన్ని వందల సినిమాలు వచ్చినా అన్నింటా వేరియేషన్ మైంటైన్ చెయ్యడం ఆయన గొప్పతనం. ఆయన కెరీర్ లో విశ్వరూపం ఒక మంచి చిత్రంగా నిలిచింది. కమల్ స్వీయ దర్సకత్వం లో వచ్చిన ఆ సినిమా కమల్ కి డైరెక్టర్ గానే కాక ప్రొడ్యూసర్ గా హీరోగా కూడా పేరు తెచ్చింది. విశ్వరూపం 2 విషయం లో మాత్రం ఎన్నో సంవత్సరాలు గా కమల్ నానుస్తూనే ఉన్నాడు. విశ్వరూపం2 షూటింగ్ మొదలైపోవడం.. చాలాభాగం పూర్తి చేసుకోవడం వరకూ జరిగాక.. అర్ధాంతరంగా ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. విశ్వరూపం2 ఎందుకు సడెన్ గా నిలిచిపోయిందో అసలు విషయం చెప్పేశారు కమల్. ‘నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్.. ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిధులు రిలీజ్ చేయాల్సి ఉంది. ఆ డబ్బులతో నేను వాటిని టీం మెంబర్లకు చెల్లించాలి. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులకే ఆరు నెలలు పడుతుంది. అదంతా జరగాలంటే టీంకి బకాయిలే కాదు.. పారితోషికం కూడా చెల్లించాల్సిందే’ అన్నారు కమల్ హాసన్.