రెండో భారతీయుడు రెడీ అవుతున్నాడు ?

Thursday, October 19th, 2017, 12:52:00 PM IST

జాతీయ నటుడు కమల్ హాసన్ నటించిన భారతీయుడు సినిమాను ఎవరు మరచిపోరు.. అవినీతిపై పోరాటం చేసిన భారతీయుడిగా కమల్ హాసన్ ఉత్తమ నటన అందరిని ఆకట్టుకుంది. తాజాగా భారతీయుడు సినిమాకు సీక్వెల్ రూపొందే సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సీక్వెల్ సన్నాహాలు మొదలు పెట్టాడు నిర్మాత దిల్ రాజు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాకోసం కమల్ హాసన్ ప్రయత్నాలు మొదలు పెట్టాడు .. అందుకే ఫిట్ నెస్ తో ఉండేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడట. తిండి తో పాటు కసరత్తులు ప్రారంబించాడట కమల్. దానికోసం అమెరికా నుండి ప్రత్యేక టీమ్ ను దింపాడట !! అప్పట్లో భారతీయుడు సినిమాలో ఎలా ఉన్నాడో అచ్చంగా అలాంటి లుక్ లో కనిపిస్తాడట !! సో వచ్చే ఏడాది ద్వితీయార్థంలో మొదలయ్యే ఈ సినిమా నాటికీ కొత్త కమల్ ను చూస్తారట.