సోనమ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఫైర్ బ్రాండ్ ?

Monday, October 8th, 2018, 10:14:08 PM IST

బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ అని ఎవరిని అంటారో తెలుసుగా .. అదే మీరు ఊహించిందే .. కంగనా రనౌత్. పలు సంచలనాలతో బి టౌన్ లో దుమారమే రేపుతోంది. తాజాగా క్వీన్ సినిమా దర్శకుడు నన్ను లైంగికంగా వేధించాడంటూ నానా రచ్చ చేసిన కంగనా తాజాగా బాలీవుడ్ గ్లామర్ భామ సోనమ్ పై ఘాటు వాక్యాలు చేసింది. ఇటీవలే సోనమ్ కంగనా వ్యాఖ్యలకు స్పందిస్తూ .. మీ చేసే వాఖ్యాలను సీరియస్ గా తీసుకోవడం కష్టం అంటూ స్పందించింది ..

ఈ వార్తలపై కంగనా ఫైర్ అయింది .. నాపై సోనమ్ అన్న మాటలకూ అర్థం ఏమిటి ? అంటూ ప్రశ్నించింది. కొందరు మహిళలను మాత్రమే నమ్మాలన్న లైసెన్స్ ఆమెకు ఉందా ? నేను చెప్పేవి తప్పని ఎలా అంటుంది అంటూ కాస్త జోరుగానే ఫైర్ అయింది. తన తండ్రి వల్ల పేరు తనకు రాలేదని ..ఏంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చనిని, ఆమె గొప్ప నటి ఏమి కాదని చెప్పింది. మరి ఈ విషయం పై సోనమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి .