ఫిబ్రవరి 24న కంగనా ‘తలైవి’ ఫిక్స్ !

Saturday, December 26th, 2020, 01:30:28 AM IST

తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ‘తలైవి’ అనే టైటిల్ తో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితగారి జీవితం ఆధారంగా బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుందని.. జయలలిత పుట్టిన రోజు ఫిబ్రవరి 24వ తేదీన ఈ సినిమాని విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందట. తవ్రలోనే అధికారికంగా ప్రకటిస్తారట.

కాగా జయలలిత లాంటి బలమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలంటే కంగనా రనౌత్ లాంటి బలమైన నటి అయితేనే ఆ పాత్రకు పూర్తి న్యాయం జరుగుతుంది. మరి ఎప్పుడూ వివాదాస్పద విషయాలతో తన ఘాటైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే కంగనా రనౌత్‌ జయలలిత పాత్రను ఎలా మెప్పిస్తోందో చూడాలి. బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు , హిందీ భాషల్లో కూడా విడుదలకానుంది.

ఈ బయోపిక్ లో మిగిలిన కీలకమైన పాత్రలు ఎం.జి.రామచంద్రన్ మరియు కరుణానిధి పాత్రలు. ఎం.జి.రామచంద్రన్ పాత్రలో అరవింద్‌ స్వామి నటించబోతుండగా..అదే విధంగా మరో కీలక పాత్ర మాజీ సీఎం కరుణానిధి పాత్రలో నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు