నాని సరసన కన్నడ హీరోయిన్ ఓకే అయింది ?

Saturday, October 13th, 2018, 01:18:42 PM IST

వరుస విజయాలతో జోరుమీదున్న హీరో నాని తాజాగా దేవదాస్ విజయంతో మంచి ఊపుమీదున్నాడు. ఈ ప్రాజెక్ట్ తరువాత జెర్సీ అనే క్రికెట్ నేపథ్యం ఉన్న కథతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా కిశోరం విదేశాల్లో ఉన్నాడు నాని. గౌతమ్ తిన్ను సూరి దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో కన్నడ హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ ని హీరోయిన్ గా ఎంపిక చేసారు. శ్రద్ధ శ్రీనాథ్ ఇప్పటికే కన్నడలో హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంది. నాని క్రికెటర్ గా నటిస్తున్న ఈ సినిమా తో పాటు అటు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో మరో సినిమాకు ఓకే చెప్పాడు. నాచురల్ స్టార్ గా టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న నాని కోసం ఇప్పటికే పలువురు దర్శక నిర్మాతలు క్యూ లో ఉన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments