సన్నిలియోన్ కు వ్యతిరేకంగా నిరసనలు ?

Tuesday, October 9th, 2018, 10:48:03 AM IST

బాలీవుడ్ శృంగార తారగా సంచలనం రేపిన సన్నీ లియోన్ అంటే క్రేజ్ ఉందని ప్రేక్షకుడు ఎవరు ఉండరు. ఆమె తమ ప్రాంతానికి వస్తుందంటే చాలు .. జనాలు ఎగబడిపోవడం మనం ఇదివరకే చాలా చూసాం .. అలాంటిది ఇప్పుడు సన్నీ లియోన్ అంటే చాలా మంది ఫైర్ అవుతున్నారు .. సన్నీ కి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి ? ఇది నిజం !! ఇంతకీ ఎందుకు ? ఎం జరిగింది అంటే .. పోర్న్ స్టార్ నుండి బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా మారిన సన్నీ లియోన్ తన ఇమేజ్ ని మార్చుకునే పనిలో ఉంది .. అందుకే ఈ సారి ఆమె వీరమహాదేవి చిత్రంలో నటిస్తుంది. కన్నడిగులు వీరమాత గా కొలిచే వీర మహాదేవి పాత్రను శృంగార తార సన్నీ లియోన్ పోషించడం ఏమిటి ? అంటూ బెంగుళూరులో కన్నడ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఆమెకు వ్యతిరేకంగా బెంగుళూరు లో కర్ణాటక రక్షణ వేదిక యువసేన ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. నిజానికి వీరమహాదేవి సినిమాను అమేఘవర్ష నృపతుంగ కథ ఆధారంగా దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సన్నీ లియోన్ లాంటి పోర్న్ స్టార్ నటించడం దారుణం అంటూ భారీగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సినిమాను ఆపేయాలంటూ పోరాటం చేస్తున్నారు.