ఫోటో టాక్‌ : `బ‌జార్‌`లో వ‌య్యారి!

Sunday, October 7th, 2018, 12:09:16 AM IST

బాలీవుడ్‌ని ద‌శాబ్ధం పైగానే ఏల్తోంది క‌త్రిన కైఫ్. ఇప్ప‌టికీ న‌వ‌త‌రం నాయిక‌ల‌కు ఠ‌ఫ్ కాంపిటీష‌న్ ఇస్తూ గుబులు పెంచుతోంది. ఏజ్‌తో సంబంధం లేకుండా భారీ అవ‌కాశాలు అందుకుంటూ భారీ పారితోషికం క్యాచ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఒగ‌ల్ గిగ‌ల్ ప్ర‌ద‌ర్శ‌న‌లోనూ అంతే స్పీడ్‌గా ఉంటోంది.

క‌త్రిన తాజా ఫోటోషూట్ ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌. ప్ర‌ఖ్యాత ఆంగ్ల మ్యాగ‌జైన్ `బ‌జార్ క‌వ‌ర్‌పేజీ` ఫోటోషూట్ యువ‌త‌రం సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతోంది. ఈ ఫోటోలో క‌త్రిన కిల్లింగ్ లుక్స్ మ‌తిచెడ‌గొడుతున్నాయి. బ్లాక్ క‌ల‌ర్ సూట్‌లో ఎంతో సింపుల్‌గా క‌నిపిస్తూనే వేడెక్కించ‌డం చ‌ర్చ‌కొచ్చింది. ముఖ్యంగా దేవ‌తాసుంద‌రి లాంటి ఆ మోములో అగ్గి రాజుకుపోయే ఎక్స్‌ప్రెష‌న్‌తో చంపేసిందంటే న‌మ్మండి. ఒక‌వేళ సందేహం క‌లిగిన‌చో ఇదిగో ఈఫోటోని త‌నివితీరా వీక్షించి క‌న్ఫ‌ర్మేష‌న్ కి రావాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం క‌త్రిన న‌టించిన థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్ సంచ‌ల‌నాల‌కు రెడీ అవుతోంది. అటుపై జ‌న‌వ‌రిలో భాయ్ స‌ర‌స‌న న‌టించిన `భ‌ర‌త్` చిత్రంతోనూ మ‌రోసారి వేడి పెంచుతుంది. అదీ సంగ‌తి.