నాని సినిమా పట్ల నవ్వుకుంటున్న కౌశల్ అభిమానులు..!

Wednesday, September 26th, 2018, 08:07:20 PM IST

నాచురల్ స్టార్ నాని మరియు యువ సామ్రాట్ నాగార్జున హీరోలుగా వైజయంతి మూవీస్ బ్యానర్లో శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రం “దేవదాస్”.ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ తోనే ఆసక్తిని పెంచేశారు.ఆ తర్వాత విడుదలయ్యిన పాటలు టీజర్లతో ఇంకాస్త హైప్ పెంచుకున్నారు,దానికి తోడు మల్టీస్టారర్ చిత్రం కావడంతో ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ చిత్రం విడుదలకి వస్తున్న స్పందన చూసి కౌశల్ ఆర్మీ నవ్వుకుంటున్నారు.

బిగ్ బాస్ షోలో నాని ప్రతీ సారి కౌశల్ ని టార్గెట్ చేస్తున్నాడని కౌశల్ ఆర్మీ వాదన,దీనిలో భాగంగానే తాము దేవదాస్ చిత్రాన్ని బోయికాట్ చేస్తున్నామని కూడా తెలిపారు,దీనితో నాని కూడా ఎవరెన్ని చేసినా సినిమాని ఆపడం ఎవ్వరి తరము కాదంటూ గట్టిగానే సమాధానం ఇచ్చాడు.ఇదెలా ఉండగా దేవదాస్ చిత్రం విడుదల సమయం దగ్గర పడుతుండగా కౌశల్ అభిమానులు ఈ చిత్రం విడుదలవుతున్నా సరే ఆన్లైన్ టికెట్ బుకింగ్ విషయంలో నవ్వుకుంటున్నారు.”మూడు రోజులు అయ్యింది టికెట్స్ బుకింగ్ ఓపెన్ చేసి బుకింగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని” కౌశల్ అభిమానులు నవ్వుకుంటున్నారు.ఇంటర్వ్యూలలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని,ఇది కౌశల్ ఆర్మీ పవర్ అంటూ బుకింగ్ కి నోచుకోని థియేటర్ల ఫొటోలతో ఎద్దేవా చేస్తున్నారు.