ఇక కీరవాణి వారసుల వంతు…!

Thursday, November 1st, 2018, 05:47:35 PM IST

తెలుగు సినిమా సంగీత దర్శకుల్లో కీరవాణి కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీలోని అందరు అగ్ర దర్శకులతో పని చేసి, మాస్, మెలోడీ, డివోషనల్ అన్న తేడా లేకుండా హిట్స్ ఇచ్చన సంగీత దర్శకుడు ఆయన, ముఖ్యంగా రాఘవేందర్రావు, రాజమౌళి లతో చేసిన ప్రతి సినిమా హిట్ అనే చెప్పాలి. ఆ మధ్య ఇక సినిమాలకు సంగీతం అందించటం పూర్తిగా మానేస్తా అన్న ఆయన, అభిమానులు సన్నిహితుల కోరిక మేరకు అడపాదడప సినిమాలకు సంగీతం అందిస్తున్నారు.

అయితే ఇప్పుడు ఆయన తనయులను పరిచయం చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు, కీరవాణి ఇద్దరి కుమారులలో ఒకడైన కాలభైరవ ఇప్పటికే సింగర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు,అతను పాడిన పాటలలో బాహుబలి, మళ్ళీ రావా,అరవింద సమేత వంటి చిత్రాల్లోని హిట్ పాటలు ఉన్నాయి. అయితే కాలభైరవ తన తదుపరి చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా, నటుడిగా పరిచయం అవబోతున్నాడట. ఇక మరో కుమారుడు సింహ సింహ దర్శకుడిగా పరిచయం అవబోతున్నాడట, ఇతను ఇంతకముందు సుకుమార్ దగ్గర రంగస్థలం సినిమాకు గాను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడట. వీరిద్దరూ ఒకే సినిమాతో పరిచయం వబోతుండటం విశేషం, ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించబోతున్నారట . సింహ ఈ సినిమా కోసం ఒక ఆసక్తికరమైన కథ సిద్ధం చేసాడట, త్వరలోనే ఈ సినిమా పై ఒక అధికారిక ప్రకటన రాబోతుంది. ఇది మైత్రి మూవీ మేకర్స్ బ్యానేర్ పై వస్తున్న లో బడ్జెట్ సినిమా కావటం గమనార్హం.

  •  
  •  
  •  
  •  

Comments