కీర్తి అభిమాని ఎంత ప‌ని చేశాడంటే?

Tuesday, April 24th, 2018, 12:09:44 AM IST

అభిమానం అనే పిచ్చి పీక్స్ కి చేరితే ఎలాంటి దుష్ప‌రిణామాలు ఉంటాయో తెలిసిందే. అయితే ఈ అభిమానం అలాంటిది కాదు. ప్రేమ‌తో కూడుకున్న గొప్ప అనుభూతికి సంబంధించిన అభిమాన‌మిది. ఆ మాట ఈ ఛాయాచిత్రాలు చూశాక మీరే చెబుతారు. కీర్తి సురేష్ `మ‌హాన‌టి` లుక్‌ని ఎంతో ప్రేమాభిమానాల‌తో స్కెచ్ వేసి నేరుగా త‌న‌కే ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడో అభిమాని.

ఈ బొమ్మ‌ను చూస్తే అచ్చం సావిత్రి, కీర్తి లుక్ అచ్చు గుద్దిన‌ట్టే దిగిపోయింది. మ‌హాన‌టి సావిత్రి పాత్ర‌లో అభిన‌యిస్తున్న కీర్తికి ఇది స్పెష‌ల్ ట్రీట్ అనే చెప్పాలి. ప్రేమాభిమానాల్ని చాటుకునేందుకు ఫ్యాన్స్ ఇలా చేయ‌డం ఎప్ప‌టినుంచో ఉన్న‌దే అయినా ఈ ఛాయాచిత్రాలు మాత్రం క‌ళ్లు తిప్పుకోనివ్వ‌నంత ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తున్నాయి.. ఈ చిత్త‌రువును కీర్తి ట్విట్ట‌ర్‌లో అభిమాని షేర్ చేయ‌డంతో ఇది అంద‌రికీ చేరిపోతోంది. `మ‌హాన‌టి` మే 9న తెలుగు, త‌మిళ్‌లో భారీగా రిలీజ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా యూనిట్ ప్ర‌మోష‌న్స్‌లో వేగం పెంచిన సంగ‌తి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments