మ‌హాన‌టి కీర్తి సురేష్ ఫ్యూచ‌ర్.. ఆ చిత్ర‌మే డిసైడ్ చేయ‌నుందా..?

Friday, October 19th, 2018, 04:57:19 PM IST

నేనులోక‌ల్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్.. ఆ త‌ర్వాత న‌టించిన‌ మ‌హాన‌టి చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా సావిత్రి పాత్ర‌లో కీర్తి ఒదిగిపోవ‌డంతో ఒక్క‌సారిగా కీర్తి సురేష్ ఫేటే మారిపోయింది. మ‌హానటి కీర్తి ప్ర‌తిష్ట‌ని ఆకాశ‌మంత ఎత్తుకు తీసుకొనిపోతే.. ఇటీవ‌ల వ‌చ్చిన సామి స్క్వేర్ చిత్రం డిజాస్ట‌ర్‌తో నేల‌కు దించింది. అయితే ఆ త‌ర్వాత అయినా త‌న ఫేట్ మారుతుంది అనుకుంటే.. పందెకోడి2 బిలో యావ‌రేజ్ టాక్ రావ‌డంతో కీర్తి సురేష్‌కి మ‌రోసారి చుక్కెదురైంది.

ఇక పందెంకోడి2 చిత్రంలో విశాల్ న‌ట‌న‌కి మంచి పేరు వ‌చ్చినా.. కీర్తికి మాత్రం సోసోగానే మార్కులు ప‌డ్డాయి. ప‌ల్లెటూరు అల్ల‌రి అమ్మాయిగా చేసిన కీర్తి న‌ట‌న కొంచెం ఓవ‌ర్ అనిపించ‌క మాన‌దు. ఈ చిత్రంలో కీర్తి స్కూట‌ర్ ముందు టైర్ గాల్లోకి లేపి సెల్ఫీ దిగ‌డం, వెళుతున్న జీప్‌లో నుండి మ‌ర్రి ఊడ‌లు ప‌ట్టుకొని దూక‌డం చాలా ఫ‌న్నీగా అనిపించినా.. కొన్ని సీన్ల‌లో అయితే ఆమె హావ‌భావాలు చిరాకు తెప్పిస్తాయి. పందెకోడి చిత్రంలో మీరా జాస్మిన్ క్యారెక్ట‌ర్ ఎక్స్‌లెంట్‌గా డిజైన్ చేసి మంచి రిజ‌ల్ట్ రాబ‌ట్టిన లింగుస్వామి.. ఈ చిత్రంలో మాత్రం కీర్తి క్యారెక్ట‌ర్‌ని స‌రిగ్గా డిజైన్ చేయ‌క పోవ‌డంతో చారుమ‌తి పాత్ర తేలిపోయింది. ఇక ఈ సినిమా హిట్ అయినా కీర్తికి క‌లిసివ‌చ్చేది. అయితే రిజ‌ల్ట్ తేడాగా రావ‌డంతో ఈ ముద్దుగుమ్మ‌కి నిరాశ త‌ప్ప‌లేదు. ఇక కీర్తి భ‌విష్య‌త్తు మురుగ‌దాస్ మీదే ఆధార‌ప‌డిందని చెప్పాలి. విజ‌య్ కీర్తీ సురేష్‌లు జంట‌గా స‌ర్కార్ చిత్రం వ‌స్తున్నా సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్.. మ‌రి ఈ డైరెక్ట‌ర్ అయినా కీర్తిని విజ‌యాల బాట ప‌ట్టిస్తాడో లేదో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments