“సర్కారు వారి పాట” లో మహేష్ సరసన కీర్తి సురేష్!?

Thursday, June 18th, 2020, 04:05:53 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం సర్కారు వారి పాట ప్రి ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి 24 ఫ్రేమ్స్ కి సంబంధించిన వారిని పరశురామ దగ్గర ఉండి మరి సెలక్ట్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి మహేష్ బాబు సరసన ఆకట్టుకొనే తరహాలో హీరోయిన్ పాత్ర కోసం దర్శకుడు అన్వేషిస్తున్నారు. అయితే ఈ పాత్ర కోసం ముందుగా బాలీవుడ్ హీరోయిన్ ను అనుకున్నారు. అయితే పలు కారణాల వలన అది కుదరలేదు. అయితే ప్రస్తుతం కీర్తి సురేష్ ను హీరోయిన్ పాత్ర కోసం సంప్రదించినట్లు తెలుస్తుంది.

అయితే ఈ చిత్రం లో కీర్తి సురేష్ పాత్ర నేరేషన్ పూర్తి అయినట్లు తెలుస్తుంది. ఈ పాత్ర ను వివరించగా కీర్తి సురేష్ కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అయితే చిత్ర యూనిట్ ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తోంది. మహానటి చిత్రం తో తారాస్థాయి లో తన నటనా ప్రతిభ ను కనబర్చిన కీర్తి సురేష్ ఈ చిత్రం లో ఉంటే ప్లస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని సంగీతం తమన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్, మహేష్ బాబు ఎంటర్టైన్మెంట లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఇది. సరిలేరూ నీకెవ్వరు చిత్రం తర్వత మహేష్ బాబు నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.