స‌ర్కార్ కోసం ఇంట‌ర్వ్యూ.. మ‌హాన‌టి కోరిక తీరుతుందా..?

Friday, October 26th, 2018, 05:25:50 PM IST

మహానటి చిత్రంతో రాత్రికి రాత్రే పాపుల‌ర్ అయిన త‌మిళ భామ‌ కీర్తి సురేష్ ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల‌తో దూసుకుపోతుంది. విజ‌య‌ద‌శ‌మి రోజున విడుద‌ల అయిన పందెంకోడి-2 చిత్రంతో ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన కీర్తి సురేష్.. ఈసారి మ‌రో క్రేజీ అండ్ సెన్షేష‌న్ ప్రాజెక్ట్‌తో మ‌న ముందుకు రానుంది. త‌మిళ స్టార్ హీరో విజ‌య్- సెన్షేష‌న్ డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న స‌ర్కార్ చిత్రంలో కీర్తీ సురేష్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసందే. దీపావ‌ళి కానుక‌గా నవంబ‌ర్ 7న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ చిత్రం విడుద‌ల కానుంది.

ఈ నేప‌ధ్యంలో స‌ర్కార్ చిత్రం ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఓ చాన‌ల్‌కి ఇంట‌ర్వ్యూ ఇచ్చిన కీర్తి సురేష్ కొన్ని ఆశ‌క్తిక‌ర విష‌యాల‌ను బ‌య‌ట పెట్టింది. విజ‌య ఈ చిత్రంలో అద‌ర‌గొట్టాడ‌ని, మురుగ‌దాస్ ఈ చిత్రాన్ని అద్భుతంగా మ‌లిచాని కీర్తి కొనియాడింది. ఇక వ‌రుస‌గా స్టార్ హీరోల‌తో న‌టించడం చాలా ఆనందంగా ఉంద‌ని.. అయితే త‌న‌కు మాత్రం ఒకరితో న‌టించాల‌ని ఉంద‌ని కీర్తీ చెప్పింది. త‌మిళ హీరో విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య సేతుప‌తి న‌ట‌న అంటే చాలా ఇష్ట‌మ‌ని.. ఆయ‌న‌తో ఒక్క‌సారైనా క‌లిసి ప‌ని చేయాల‌ని కీర్తి త‌న మ‌న‌సులోని కోరిక‌ను బ‌య‌ట‌పెట్టింది. మ‌రి వ‌రుస‌గా స్టార్ హీరోల‌తో న‌టిస్తున్న కీర్తి కోరిక నెర‌వేరుతుందో లేదో చూడాలి.