హాట్ టాపిక్ : మహేష్ అభిమానులకు “మహానటి” గుడ్ న్యూస్!

Friday, June 19th, 2020, 01:03:46 PM IST

నేడు పెంగ్విన్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదల కారణంగా మహానటి కీర్తి సురేష్ నిన్న సోషల్ మీడియా లో అభిమానులతో ముచ్చటించారు. అయితే అభిమానులతో జరిపిన చిట్ చాట్ లో నటి కీర్తి సురేష్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ మేరకు మహేష్ అభిమాని అడిగిన ఒక ప్రశ్నకు కీర్తి సురేష్ స్పందించారు.

సర్కార్ వారి పాట చిత్రం లో కథానాయిక కోసం చిత్ర యూనిట్ అన్వేషణ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే మొన్నటి వరకు ఎన్నో అగ్ర కథానాయికల పేర్లు వినిపించిన, ఆఖరికి కీర్తి సురేష్ ఫైనల్ అంటూ ఒక వార్త సోషల్ మీడియా లో హల్చల్ చేసింది. అయితే మహేష్ అభిమాని ఇలా అడిగారు. సర్కార్ వారి పాట చిత్రం లో కథానాయిక గా నటిస్తున్నారా? అని అడగగా సర్కారు వారి పాట చిత్రం లో తానే కథానాయికగా నటిస్తున్న విషయం నీ చెప్పింది.

అయితే కీర్తి సురేష్ ఈ ఇచ్చిన ఆన్సర్ కి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మరొక బ్లాక్ బస్టర్ విజయం కోసం మహేష్ సిద్దం అవుతున్నారు. కీర్తి సురేష్ తల్లి పాత్రలో నటించిన పెంగ్విన్ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.